Site icon Prime9

Leafy Vegetables: ఆకుకూరలా.. అని లైట్ తీసుకోవద్దు

Leafy Vegetables

Leafy Vegetables

Leafy Vegetables: ఆకుకూరలు అనగానే చాలామంది నిట్టూరుస్తారు. కానీ వాటిలో ఉండే పోషకాలు, ఔషద గుణాలు తెలిస్తే మాత్రం వాటిని కేర్ లెస్ గా తీసుకోము. ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటిని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఆరోగ్య పరిరక్షణలో ఆకుకూరలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని రోజూ వారి ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

 

మెదడు చురుగ్గా పనిచేసేందుకు(Leafy Vegetables)

పాలకూర, తోటకూర, మెంతి, బచ్చలి, గోంగూర లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఐరన్‌, ఫోలేట్‌, ప్రొటీన్లు, విటమిన్లు లాంటివెన్నో వీటిల్లో పుష్కలంగా దొరుకుతాయి. ముఖ్యంగా ఈ కూరల్లో ఉండే పీచు జీర్ణప్రక్రియకు బాగా తోడ్పడుతుంది. సి, ఇ విటమిన్లు, బీటా కెరొటిన్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి.

ఆకుకూరల్లో ఉండే కె విటమిన్‌ ఎముకలను బలంగా ఉంచుతుంది. ఆస్టియోపోరోసిస్‌ బారిన పడకుండా కాపాడుతుంది. జ్వరం, వాతం లాంటి వాటిని నివారిస్తుంది. మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని సమతుల్యం చేస్తాయి.

ఆకు కూరలతో ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలిగిపోతాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. తరచూ ఆకుకూరలు తినేవారిలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. రక్తం గడ్డ కట్టదు.

The Best Leafy Green Recipes for Vegetarians

ఊబకాయం రాకుండా..

పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోదు.. ఊబకాయం రాకుండా ఉంటుంది. చర్మానికి మృదుత్వం వచ్చి.. ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.

ఆకు కూరలను కూర, పచ్చడి గానే కాకుండా పకోడీ, గారెలు, సలాడ్స్‌, పెరుగు పులుసు లాంటివి చేసుకోవచ్చు. దళసరిగా ఉండే ముల్లంగి, క్యాలీఫ్లవర్‌ల ఆకులు సైతం మంచి పోషకాహారం. వీటికి పెసరపప్పు కలిపి వండితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంగా లభిస్తుంది.

ఆకుకూరలను సన్నగా తరిగి.. పిండితో కలిసి చపాతీలు, పరాఠాలు రూపంలో తీసుకోవచ్చు. ఆకుకూరలు పప్పుతో ఉడికించి తింటే ఆహారంలో మాంసకృతులు పరిమాణం పెరుగుతుంది.

ఆకుకూరలను వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత తక్కువ నీటిలో, తక్కువ సేపు ఉడికించాలి. ఎక్కువగా ఉడికడం వల్ల వీటిలోని పోషక విలువలు తగ్గుతాయి.

ఇన్ని ఉపయోగాలు ఉండే ఆకుకూరలు మనకు చాలా చవగ్గానూ లభిస్తాయి. అంతేకాదు చిన్న చిన్న కుండీల్లో.. పెరట తోటల్లో పెంచుకోవచ్చు.

 

 

Exit mobile version
Skip to toolbar