Site icon Prime9

Diabetes Diet: డయాబెటిస్ రోగులు ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

Diabetes Diet: మీరు డయాబెటిస్ ఉన్న వ్యక్తి అయితే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఉండాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక ఆహార పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచగలదన్నదానికి కొలమానం.

ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు సాధారణంగా తక్కువ గ్లైసెమిక్ సూచిక ( GI ఇండెక్స్ )ను కలిగి ఉంటాయి. అధిక GI ఇండెక్స్ ఉన్న ఆహారాలు త్వరగా జీర్ణమవుతాయి మరియు మీ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచే ధోరణిని కలిగి ఉంటాయి. ప్రతి ఆహార పదార్థానికి ఒక నిర్దిష్ట విలువ కేటాయించబడుతుంది, ఇది మీ డయాబెటిస్ డైట్‌లో ఏ ఆహార పదార్థాలను చేర్చాలో నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది. డయాబెటిస్ వున్న వ్యక్తులు రోజు మొత్తంలో తీసుకునే మెనూ ఈ విధంగా వుండాలి.

బ్రేక్ ఫాస్ట్..
మీరు తీసుకునే అల్పాహారంమీ రోజును ప్రారంభించడానికి మీకు అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. మీరు వేయించిన కూరగాయలతో గుడ్లను తీసుకోవచ్చు. దానితో పాటు అవిసె గింజలతో మజ్జిగ తీసుకోవచ్చు. పుట్టగొడుగులు, ఫ్రెంచ్ బీన్స్, బ్రోకలీ, క్యాప్సికమ్, టొమాటోలు మొదలైన మూడు నుండి నాలుగు కూరగాయల మిశ్రమాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం మంచిది.
లంచ్..
కూరగాయలు ఫైబర్ ను కలిగి వ్యాధులతో పోరాడటానికి సహాయపడే ఫైటోకెమికల్స్ కలిగి ఉంటాయి. అందువలన లంచ్ లో కూరగాయలు మరియు ప్రొటీన్‌లతో భోజనం ఉండాలి.
స్నాక్స్..
ఒక కప్పు గ్రీన్ టీ, గింజలను స్నాక్స్ గా తీసుకోవచ్చు. హెర్బల్ టీలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.
డిన్నర్..
డిన్నర్ విషయంలో అతిగా తినకుండా చూసుకోవాలి. తక్కువ పరిమాణంలో చికెన్ కర్రీని తినవచ్చు. మీరు దోసకాయ క్యారెట్ సలాడ్‌ను, మిక్స్ డ్ వెజిటబుల్ తీసుకోవచ్చు.

పైన చెప్పిన డైట్ ను తీసుకుంటూ నియమబద్దమైన వ్యాయామాన్ని చేయాలి మరియు మీ చక్కెర స్థాయిలను రోజూ పర్యవేక్షించాలి. మీరు మీ చక్కెర స్థాయిని తెలుసుకున్నప్పుడు మాత్రమే, మీరు మీ ఆహారం మరియు జీవనశైలిని సమన్వయం చేసుకోగలుగుతారు.

Exit mobile version