Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయను సాధారణంగా కూరగాయగా ఉపయోగించడం పరిపాటి. అయితే గుమ్మడికాయ మాత్రమే కాదు గుమ్మడి గింజలు తినడం వలన కూడ మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి.. గుమ్మడి కాయ గింజలను తృణధాన్యాలు, సూప్స్ మరియు సలాడ్లలో చేర్చడం ద్వారా తీసుకోవచ్చు. వీటిని కూరగాయల ఫ్రైలలో వేయవచ్చు లేదా కాల్చి తీసుకోవచ్చు. సాయంత్రం స్నాక్ వలె తీసుకోవచ్చు .
గుమ్మడికాయ గింజలు మెగ్నీషియం నిల్వలను కలిగి ఉంటాయి, ఇవి గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రక్తపోటును నిర్వహించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం మరియు జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల ఉనికి, హార్మోన్లు ఉత్తేజితమవడంలో సహాయం చేస్తుంది. గుమ్మడికాయ గింజలు జింక్ నిక్షేపాలతో కూడుకుని ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచి, పురుషుల సంతానోత్పత్తి మెరుగుపరుస్తాయి. ఇది ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. గుమ్మడికాయ విత్తనాలు ప్రోటీన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, ఇనుము, జింక్ మరియు పొటాషియం నిక్షేపాలకు మూలంగా ఉంటాయి. ఇవి పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన పోషకాలుగా ఉన్నాయి. ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
ప్రోస్టాటిక్ హైపెర్ప్లాసియా అనగా ప్రోస్టేట్ గ్రంధి అసాధారణంగా పెరగడం. దీని కారణంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కావున, ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా (బి.హెచ్.పి) సంబంధించిన లక్షణాలను తగ్గించడానికి ఇవి దోహదపడుతాయి. కండరాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. కండరాల నిర్మాణం మరియు మరమత్తుల కోసం ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ గుమ్మడికాయ గింజల్లో సమృద్ధిగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్టుమెంటు అఫ్ అగ్రికల్చర్ వారి పోషకాల చార్ట్ ప్రకారం 23.33 గ్రాముల గుమ్మడి గింజలలో 100 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. ఇవి కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతాయి. గుమ్మడికాయ గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అజీర్ణం నివారించడంలో కూడా సహాయం చేస్తాయి.
గుమ్మడికాయగింజలు ఫైబర్ నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటాయి, కనుక వాటిని పెద్ద పరిమాణాల్లో లేదా అదే పనిగా తినడం మూలంగా గ్యాస్ మరియు ఉబ్బర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి అధిక మోతాదులో తీసుకోవడం మూలంగా మలబద్ధక సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరిమితి మించకుండా తీసుకోవాలి.