Site icon Prime9

Verusenaga Bellam Undalu: ఆరోగ్యాన్నిచ్చే వేరుశనగవుండలు..

Verusenaga Bellam Undalu: బెల్లం అంటే చాలామందికి ఇష్టం. బెల్లంతో చేసిన వంటకాలనే కాదు, ఉత్తి బెల్లాన్ని తినేందుకు కూడ చాలామంది ఇష్టపడతారు. బెల్లం, వేరుశనగలు కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. బెల్లంతో కలిపి వీటిని తినడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది.

పల్లీలు తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడటంతోపాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. బెల్లం, వేరుశనగలను తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. వేరుశనగ, బెల్లం ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపేస్తాయి. బెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి.

ఎలా తయారు చేయాలి..
అర కిలో వేరుశనగలు, అర కిలో బెల్లం తీసుకోండి. వేరుశనగ గింజలను వేయించి పొట్టు తీసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి దళసరిగా ఉండే గిన్నె పెట్టి, అందులో బెల్లం, కొద్ది మోతాదులో నీరే వేసి, చిక్కగా పాకం పట్టుకోండి. తర్వాత వీటిలో వేరుశనగ గింజలు కలిసేలా తిప్పాలి. ఓ ప్లేట్‌కి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఉండల్లా చుట్టుకోవాలి. అంతే పల్లీ ఉండలు రెడీ.ఈ వేరుశనగవుండలను స్నాక్స్ గా తింటే ఆరోగ్యం, శక్తి రెండూ వస్తాయి.

Exit mobile version