Site icon Prime9

Bread Recipe: స్వీట్ బ్రెడ్ జామూన్ ఎలా తయారు చేయాలో చుద్దాం

Bread recipe prime9news

Bread recipe prime9news

Bread Recipe: ఇప్పటి వరకు మనం బ్రెడ్ తో చాలా రకాలుగా టేస్టీ రెసిపిస్ చూసి ఉంటాము.ఈ సారి కొత్తగా స్వీట్ బ్రెడ్ జామూన్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేద్దాం.అలాగే వీటికి కావలిసిన పదార్థాలు తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం.ముందుగా కావలిసిన పదార్థాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు :
1 కప్పు పంచదార
3 యాలకులు
1 టేబుల్‌ స్పూను నిమ్మరసం
6 తెల్లని బ్రెడ్‌ ముక్కలు
2 టేబుల్ స్పూన్లు క్రీమ్‌ మిల్క్‌ పౌడర్‌
1 టేబుల్‌ స్పూను ఫ్రెష్ క్రీం
4 టేబుల్‌ స్పూన్లు మిల్క్
సరిపడా నెయ్యి
తయారీ విధానం :
ఒక గిన్నెలో పంచదార,కప్పు నీళ్లు తీసుకుని పాన్ మీద వేడి చేయాలి.సన్నని మంటమీద వాటిని బాగా మరిగించుకోవాలి.మరిగించడం ఐపోయిన తరువాత యాలకులపొడి,నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.తరువాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తెల్లని బ్రెడ్డును తీసుకొని ముక్కలుగా చేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టిన పొడికి పాలపొడి, ఫ్రెష్‌ క్రీమ్‌ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో పాలు పోసుకుంటూ మెత్తని ముద్దలా అయ్యేవరకు బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి రాసుకుని పిండి ముద్దను చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టి,ఇప్పుడు గ్యాస్ మీద పాన్ పెట్టి నూనె వేసి, ఆ నూనె బాగా కాగిన తరువాత ఉండలను నూనెలో వేయాలి. ఉండలు రంగు మారే వరకు ఉంచుకొని దించండి. తరువాత ఉండలను పంచదారలో 1 గంట పాటు అలాగే ఉంచండి. 1 గంట ఆగిన తర్వాత గిన్నెలో పెట్టుకొని తినేయండి.అంతే స్వీట్ బ్రెడ్ జామూన్ రెడీ .

Exit mobile version