Site icon Prime9

Mushroom Curry: రెస్టారెంట్ స్టైల్ ఆంధ్ర మష్రూమ్ కర్రీ తయారీ విధానం

mushroom curry prime9news

mushroom curry prime9news

Restaurant Style Mushroom Curry: మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మష్రూమ్స్ తో మనం ఎప్పటికప్పుడు కొత్త వంటలను ట్రై చేసుకొని తినవచ్చు. కొత్తగా మష్రూమ్స్ తో వంటలు చేస్తే  తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కొత్తగా ఆంధ్ర స్టైల్లో మష్రూమ్ కర్రీ రెసిపీని ఈ విధంగా ట్రై చెయ్యండి. ఇంకెందుకు ఆలస్యం దీనికి కావలిసిన పదార్ధాలు మరియు తయారీ విధానం గురించి  తెలుసుకుందాం.

కావలిసిన  పదార్ధాలు..

పుట్టగొడుగులు : 1/4 కేజి, ఉల్లిపాయలు : మూడు, పచ్చిమిర్చి : రెండు, కారం : టీ స్పూను, పసుపు : పావు టీ స్పూను, కొత్త మీర :ఒక  కట్ట, నూనె : వేయించడానికి సరిపడా, ఉప్పు : తగినంత తీసుకోవాలి.

తయారు చేసే విధానం..

పుట్ట గొడుగులని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లి పాయలు, పచ్చి మిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పాన్ తీసుకొని దానిలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. అవి వేగిన తరువాత పుట్టగొడుగుల ముక్కలను, పసుపు, కారం వేసి 10 నిముషాలు ఉంచాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత దించే 6 నిముషాల ముందు కొట్టి మీరను వేసి దించుకోవాలి.

 

Exit mobile version