మొక్కజొన్న గింజలతో గారెలు తయారీ

మ‌నలో చాలమంది మొక్క‌జొన్న కంకులను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎన్నో పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది.

  • Written By:
  • Updated On - August 23, 2022 / 09:16 PM IST

మ‌నలో చాలమంది మొక్క‌జొన్న కంకులను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎన్నో పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. చాలా మంది మొక్క‌జొన్న కంకుల‌ను ఉడికించి లేదా కాల్చుకుని తింటుంటారు. ఈ విధంగానే కాకుండా మొక్క‌జొన్న గింజ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే గారెల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మొక్క జొన్న గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొక్క‌జొన్న కంకుల‌తో గారెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూద్దాం.

మొక్క జొన్న గారెల‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మొక్క జొన్న గింజ‌లు – రెండు క‌ప్పులు, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌చ్చి మిర్చి , ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు, కొత్తిమీర నూనె –చాలినంత కావాలి.

ముందుగా గ్రైండ‌ర్ లో మొక్క గింజ‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు, త‌రిగిన ఉల్లిపాయ‌, ప‌చ్చి మిర్చి, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇలా మిక్సీ ప‌ట్టుకున్న పిండిలో జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, కొత్తిమీర వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత పిండిని కావల్సిన ప‌రిమాణంలో తీసుకుని గారెలుగా చేసి నూనెలో వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. . దీనితో ఎంతో రుచిగా ఉండే మొక్క‌జొన్న గారెలు త‌యార‌వుతాయి.