Site icon Prime9

Kareena Kapoor Khan: ఇక నుంచి శృంగార సన్నివేశాల్లో నటించను.. ఎందుకంటే ..?

Kareena Kapoor Khan About Intimated Scenes: బాలీవుడ్ అంటే ఎవరికైనా టక్కున ఇంటిమేటెడ్ సీన్స్ నే గుర్తుకు వస్తాయి. రొమాంటిక్ సీన్స్ కానీ, రొమాంటిక్ సాంగ్స్ కానీ లేకపోతే బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వదు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్అయితే అందాల ఆరబోత కచ్చితంగా చేయాలి. అయితే ఇకనుంచి అలాంటివేమీ తన దగ్గర కుదరవు అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్.

 

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సినిమాలు చేయకపోయినా ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సుపరిచితమే. ఒకప్పుడు తన అందచందాలతో అభిమానులను తన వైపుకు తిప్పుకున్న ఈ బ్యూటీ సైఫ్ ఆలీఖాన్ ను వివాహమాడి పటౌడీ  కోడలిగా సెటిల్ అయ్యింది.

 

పెళ్లి తరువాత కూడా కరీనా.. రొమాంటిక్ కామెడీల నుంచీ క్రైం డ్రామాల వరకూ ఎన్నో రకాల సినిమాలు చేసి మెప్పించింది. ఇక ముఖ్యంగా ఆ సినిమాల్లో ఇంటిమేటెడ్ సీన్స్ కూడా నో చెప్పింది లేదు. అయితే తాజాగా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇకనుంచి తాను.. శృంగార సన్నివేశాల్లో నటించబోయేది లేదని చెప్పుకొచ్చింది.

 

” ఇక నుంచి నేను శృంగార సన్నివేశాల్లో నటించాలనుకోవడం లేదు. ఎందుకంటే.. ఇంటిమేటెడ్ సీన్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి .. అలాంటి సీన్స్ ఉంటేనే కథ ముందుకు వెళ్తుంది అని అంటే అది నేను నమ్మను. కేవలం శృంగారం మాత్రమే  కథకు ముఖ్యం అని నేను అనుకోవడంలేదు. అలా అని నేను శృంగార సన్నివేశాలు చేయను అని చెప్పడం లేదు. కాకపోతే కథలో అది చాలా ముఖ్యం అనుకుంటే వాటిని చేస్తాను.

 

కథలో ఆ శృంగార సన్నివేశం ఎంతో ముఖ్యమని, ఎంతో కష్టపడి చేస్తే ఇండియాలో ఆ సీన్ ను వేరేలా చూస్తారు. ఇప్పటికీ  భారతదేశంలో శృంగారం గురించి బయటకు మాట్లాడడం కూడా తప్పుగా చూస్తారు  పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు  శృంగారం విషయంలో అంత ఓపెన్ గా మాట్లాడలేరు. కొన్ని దేశాల్లో స్త్రీలు వారి కోరికలను చాలా ఓపెన్ గా చెప్తుంటారు. సినిమాల్లో కూడా అలానే చూపిస్తారు. కానీ, ఇక్కడ అలా ఉండదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version
Skip to toolbar