Site icon Prime9

Vyjayanthi Movies: ఆ వ్యక్తితో మాకు ఎటువంటి సంబంధం లేదు – వైజయంతీ మూవీస్‌ ట్వీట్‌

Vyjayanthi Movies Reacts on Rumours: క్రికెట్‌ బెట్టింగ్‌లో అరెస్ట్‌ అయిన వ్యక్తికి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ స్పష్టం చేసింది. కాగా రీసెంట్‌గా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ నిలేశ్‌ చోప్రా అనే వ్యక్తిని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని విచారించగా.. తాను వైజయంత్రీ మూవీస్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులకు తెలిపినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సదరు సంస్థ స్పందించింది.

ఈ మేరకు వైజయంతీ మూవీస్‌ ఎక్స్‌లో ట్విట్‌ చేసింది. “ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కి పాల్పడుతున్న నిలేశ్‌ చోప్రా అనే వ్యక్తిని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు మా ద్రష్టికి వచ్చింది. అయితే అతడు మా సంస్థలో పని చేస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ పేరు గల వ్యక్తి ఎప్పుడు వైజయంతీ సంస్థలో పని చేయలేదు. అలాగే అతడి మాకు ఏవిధమైన సంబంధం లేదు. ఈ విషయాన్ని పోలీసు స్టేషన్‌లో సంబంధిత అధికారులకు మేము అధికారికంగా తెలియజేశాము. ఏదైన వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని మీడియాను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము” అంటూ వైజయంతీ మూవీస్‌ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Exit mobile version
Skip to toolbar