Vishnu Vishal Divorce: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, ఆమె భర్త కోలివుడ్ స్టార్ విష్ణు విశాల్ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు.. ఇటీవల విష్ణు చేసిన ట్వీటే అందుకు కారంణం.. విష్ణు చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘నేను ఎంతో ప్రయత్నించాను, కానీ విఫలమవుతూనే ఉన్నాను. మరేం పర్వాలేదు.. దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాను. అయినా అది పరాజయం కాదు.. పూర్తిగా నా తప్పే! అది ఒక మోసపూరిత ద్రోహం..’ అంటూ లైఫ్ లెస్సన్స్ హ్యాష్‌ట్యాగ్ ను యాడ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. విష్ణు, జ్వాలకు మధ్య ఏదో జరిగిందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు సృష్టించారు.
అలా అర్ధం చేసుకున్నారు(Vishnu Vishal Divorce)
అయితే , తాజాగా ఈ వ్యవహారంపై విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ‘ కొద్దిరోజుల క్రితం నేను చేసిన ట్వీట్‌ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు. నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు. కేవలం వృత్తిగత జీవితం గురించే ట్వీట్ చేశాను. ఇకపోతే మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో నమ్మకం. ఒకరికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటంటే నమ్మకం. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం. మన పట్ల మనం మరీ అంత కఠినంగా ఉండకూడదని మాత్రమే దానర్థం’ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఈ ట్వీట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టాడు హీరో.
ఇకపోతే విష్ణు విశాల్ ప్రస్తుతం లాల్ సలాం అనే సినిమా చేస్తున్నాడు. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రజనీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.