Site icon Prime9

Vijayashanthi: నా పిల్లలు వారే.. ఆస్తి మొత్తం వారికే చెందుతుంది

Vijayashanti

Vijayashanti

Vijayashanthi: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆమె నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత విజయశాంతి నటించిన చిత్రం కావడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయశాంతి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

 

యాక్షన్ సన్నివేశాల్లో ఆమె ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత చాలామంది విజయశాంతి పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమెకు పెళ్లి అయినా పిల్లలు మాత్రం లేరు. 1988లో మోటూరి వెంకట శ్రీనివాస్ ప్రసాద్ తో విజయశాంతి వివాహం జరిగింది.  కానీ ఈ జంట పిల్లలు వద్దనుకున్నారు. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చేసింది. అయితే తాను పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం ప్రజలే అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

“నేను ప్రజల కోసమే పిల్లలను వద్దనుకున్నాం. ఈ లైఫ్ ను ప్రజలకు అంకితం చేయాలనీ అనుకోని నేనే ఆయనను ఒప్పించాను. నా పిల్లలు అంటే నా ప్రజలే. ఇప్పుడు నేను సంపాదించుకున్నది.. దాచింది అంతా నా పిల్లలకే. అంటే నా ప్రజలకు మాత్రమే. అలా నా తదానంతరం నా ఆస్తులన్నీ ప్రజలకు చెందేలా చర్యలు తీసుకున్నాను.

 

నా తల్లిపేరున ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి.. విద్య, వైద్యం అవసరమైనవారికి అందించేలా చేస్తాను. నా నగలను కూడా నేను వేంకటేశ్వరస్వామి హుండీలో వేశాను” అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెల్సిన ఆమె అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి ముందు ముందు విజయశాంతి ఎలాంటి సినిమాల్లో నటిస్తుందో చూడాలి.

Exit mobile version
Skip to toolbar