Site icon Prime9

Vijay Devarakonda: అమ్మ కోరిక తీర్చిన విజయ్‌ – వాట్సాప్‌ చాట్‌ షేర్‌ చేస్తూ అసలు విషయం చెప్పిన ‘రౌడీ’ హీరో

Vijay Devarakonda Fulfilled His Mother Wish: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తన అమ్మ కోరిక తీర్చారు. వాళ్ల అమ్మ చేసి వాట్సప్‌ చాట్‌ని షేర్‌ చేస్తూ వాళ్ల అమ్మ ఆ కోరిక ఏంటో చెప్పాడు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్‌ మూవీతో బిజీగా ఉన్నారు. మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో విజయ్‌కి కాస్తా బ్రేక్‌ దొరికింది. ఈ విరామ సమయాన్ని ఫ్యామిలీ సరదగా గడిపాడు. ఈ క్రమంలో విజయ్‌ వాళ్ల అమ్మ ఈ వీకెండ్‌ ఫ్యామిలీ మొత్తం కలిసి డిన్నర్‌కు బయట వెళ్దామని అడిగింది.

 

దీనికి విజయ్‌ సరే అంటూ డిన్నర్‌ ప్లేస్‌ ప్లాన్‌ చేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఈ వీకెండ్‌ తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వాళ్ల చేసిన వాట్సాప్‌ ఛాట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. “అమ్మ.. సడెన్‌గా మనం డిన్నర్‌కి బయటకు వెళ్లవచ్చా అని అడిగింది. మేమంత కలిసి బయటకు వెళ్లి చాలా కాలం అవుతుంది. అందుకే అమ్మ ఇలా అడిగింది. మనమందరం ఎప్పుడూ మన పనితో బిజీగా పరుగులు పెడుతుంటాం. ఈ క్రమంలో జీవితాన్ని జీవించడమే మర్చిపోతాం.

 

కాబట్టి, గత రాత్రి మేము బయటకు వెళ్లి కుటుంబమంత మంచి సమయాన్ని గడపాము. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకువెళ్లండి. వారికి కొన్ని కౌగిలింతలు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీకు, మీకు కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా” అంటూ రాసుకొచ్చాడు. దీనిపై ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Exit mobile version
Skip to toolbar