Site icon Prime9

Venkatesh Maha : కేజీఎఫ్ వివాదంపై స్పందించిన డైరెక్టర్ వెంకటేష్ మహా.. ఏం అన్నారంటే!

venkatesh-maha responded on kgf movie issue

venkatesh-maha responded on kgf movie issue

Venkatesh Maha : ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా గురించి తెలుగు పేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో మచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఈ డైరెక్టర్ పేరు బాగా వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాపై వెంకటేశ్ మహా పరోక్ష విమర్శలు చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎద్దేవా చేస్తూ.. అలాంటి సినిమాలను జనం ఆదరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా యష్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. దీంతో వెంకటేష్ మహా తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు.

నా భాష తప్పు .. కానీ నా అభిప్రాయం మాత్రం కరెక్ట్..

తన అభిప్రాయం పట్ల అదే నిర్ణయంతో ఉన్నాను.. కానీ నేను మాట్లాడిన భాష మాత్రం తప్పు అందుకు సారీ అని వెంకటేష్ తెలిపారు.`కేజీఎఫ్‌` సినిమా కూడా చాలా మందికి నచ్చలేదు, వారంతా నాలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు, నేను మాట్లాడింది కరెక్టే అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. అయితే తాను సినిమాలోని కల్పిత పాత్రని విమర్శించాను, తప్ప రియల్‌ లైఫ్‌లో ఏ వ్యక్తిని, ఏ క్రియేటివ్‌ పర్సన్‌ని విమర్శించలేదు, తక్కువ చేయలేదు. కాకపోతే తాను వాడిన భాష తప్పు, మాట్లాడిన పదాలు సరిగా లేవని ఆయన తెలిపారు. ఆ విషయంలో తాను క్షమాపణనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

అలానే నా సినిమాలు నచ్చిన వారు, నా ఒపీనియన్‌ నచ్చిన వాళ్లు సందేశాలు పంపారు. వాళ్లందరి తరఫున నా వాయిస్‌ అది. నేను అన్న మాటలను ఒక రియల్‌ లైఫ్‌ పర్సన్‌కి ఆపాదించి చూడటమనేది నా అభిప్రాయాన్ని మీరు వింటున్న విధానం వల్ల వచ్చిన సమస్య అయి ఉంటుంది. ఒక ఎమోషన్‌లో ఒక కల్పిత పాత్రని దూషించాను. దానికి రియల్‌ పర్సన్‌ అయినటువంటి నన్ను ఎన్నో రకాలుగా దూషిస్తున్నారు, తప్పుడు ఇమేజ్‌ని క్రియేట్‌ చేస్తున్నారు. అసభ్యంగా దూషిస్తున్నారు. ఇది కొత్త కాదు, చాలా సార్లు చూశాను, ఇలాంటి ఎన్నో సంఘటనల కారణంగా నాకు అలాంటి అభిప్రాయం ఏర్పడింది. అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని, ఒకేలా చూస్తారని ఆశిస్తున్నాను` అని వెంకటేష్‌ మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

అంతకు ముందు అసలు ఏం అన్నారంటే..

‘‘ఒక సినిమా పేరు చెప్పను కానీ.. వివరాలు చెప్తాను.. ప్రపంచంలో ఒక తల్లి.. ‘నువ్వు గొప్పోడివి అవ్వాలరా’ అంటుంది. బాగా సంపాదించి నలుగురికీ ఉపయోగపడాలని దానికి అర్థం. కానీ తల్లి అంత కావాలి (చేతులతో చూపిస్తూ)అని అంటుంది. హీరో వెళ్లి ఆ వస్తువును తవ్వేవాళ్లను ఉద్ధరిస్తాడు. ఒక పాట వస్తుంది. వాడు మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాడు’’ అని విమర్శించారు. ‘‘ఆ మహా తల్లి నిజంగా ఉండి ఉంటే.. నాకు కలవాలని ఉంది. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా? ఎంత నీచ్ కమీన్ కుత్తే కాకపోతే వాడు.. ఎక్కడో పారదొబ్బుతాడు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడిగితే.. అలాంటి కథను సినిమాగా తీస్తే.. మనం చప్పట్లు కొట్టి చూస్తున్నాం’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అలానే వెంకటేశ్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ట్విట్టర్ వేదికగా దర్శకురాలు నందిని రెడ్డి క్షమాపణలు చెప్పారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar