Varalaxmi Sarathkumar Shocking Comments: ప్రముఖ నటుడు శరత్ కుమార్ నట వారసురాలికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింగి వరలక్ష్మి శరత్ కుమార్. అయినా తండ్రి సపోర్టు లేకుండానే స్టార్ నటిగా ఎదిగింది. మొదట హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చని వరలక్ష్మి ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఆమెకు అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో ఆమె కాస్తా బ్రేక్ తీసుకుని ప్రతి కథానాయకిగా రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో, తమిళంలో లేడీ విలన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఆమె లేడీ విలన్‌గా తనదైన నటనతో ఆడియన్స్‌ని మాత్రమే దర్శక-నిర్మాతలను కూడా మెప్పించింది. దీంతో ఆమె వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలా ప్రతికథనాయకికి సెటిలైన వరలక్ష్మి గతేడాది ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌ని పెళ్లాడింది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోన్న వరలక్ష్మి తాజాగాఓ డ్యాన్స్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొంది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రోమో విడుదల కాగా అందులో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. ఈ షో ఓ ముగ్గురు పిల్లల తల్లి అయిన మరో మహిళ మాస్ డ్యాన్స్ స్టేప్పులేసి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.
ఆమె టాలెంట్‌కి వరలక్ష్మి ఫిదా అయ్యింది. ఆ మహిళా తన డ్యాన్స్, మ్యూజిక్‌పై ఉన్న ఆసక్తిని గురించి చెప్పింది. ఆమె డ్యాన్స్‌కి ఫిదా అయిన వరలక్ష్మి ఈ సందర్భంగా తన సంబంధించని ఓ రహస్యాన్ని రివీల్ చేసింది. సినిమాలోకి రాకముందు డబ్బుల కోసం రోడ్డుపై డ్యాన్స్ చేసిన సంఘటనను గుర్తు చేసుకుంది. గతంలో నేను ఒకసారి రోడ్డుపైనే డ్యాన్స్ చేశాను. సినిమాలోకి రాకముందు ఓ షో కోసం మొదటిసారి రోడ్‌పై స్టెప్పులేశా. అప్పుడు నాకు రూ.2500 ఇచ్చారు. అదే నా ఫస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పింది.