Site icon Prime9

Urvashi Rautela New Car: మహామహుల దగ్గరే లేదు..రూ. 12 కోట్ల కారు కొన్న హాట్ బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. ఈ పేరు తెలియని ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా సినిమాల ద్వారా ఫేమస్ అవుతారు. కానీ, అమ్మడు మాత్రం సోషల్ మీడియా వివాదాలతో పేరు తెచ్చుకొని షాక్ ఇచ్చింది.ఊర్వశీ.. 2013 లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడు సనం రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4.. లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

 

ఇక తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది.ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అమ్మడి అందనికి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. వెంటనే ఈ చిన్నదానికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. మొదటి సాంగే చిరుతో అయ్యేసరికి.. స్టార్ హీరోలు ఊర్వశీ కోసం క్యూ కట్టారు.

 

వాల్తేరు వీరయ్య తరువాత ఏజెంట్, బ్రో, స్కంద సినిమాలతో ఊర్వశీ టాలీవుడ్ ను ఊపేసింది. మధ్యలో ఒక ఏడాది గ్యాప్ ఇచ్చి.. ఈ ఏడాది డాకు మహరాజ్ తో మరోసారి ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణ నటించిన ఏ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ లో అమ్మడి అందాలు.. బాలయ్య స్టెప్స్ కు థియేటరే దద్దరిల్లిపోయింది.

 

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఊర్వశీ కొత్త రికార్డును సృష్టించింది. అదేంటంటే.. ఇండస్ట్రీలో మహామహుల దగ్గరే లేని లగ్జరీ కారుకు అమ్మడు ఓనర్ గా మారింది. ఇండియాలో ఏ హీరోయిన్ కూడా ఇలాంటి రికార్డు సృష్టించలేదు. మోస్ట్ లగ్జరీయస్ కారు అయిన రోల్స్ రాయిస్ కులినన్ ను ఊర్వశీ సొంతం చేసుకుంది. దీని ధర అక్షరాలా రూ. 12 కోట్లు. ఏంటి అని కోట్ల కారా.. ? అని ఆశ్చర్యపోకండి. అన్ని కోట్లే.

 

ఇప్పటివరకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లకు కూడా ఇలాంటి కారు లేదు. హీరోయిన్లు మాత్రమే కాదు స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న హీరోలకు కూడా ఈ కారు లేదు. అందుకే ఇండియాలోనే రోల్స్ రాయిస్ కులినన్ ను సొంతం చేసుకున్న మొదటి నటిగా ఊర్వశీ రికార్డు సృష్టించింది.

 

ఇప్పటివరకు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, భూషణ్ కుమార్.. తెలుగులో అల్లు అర్జున్.. హాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్దషియాన్ వద్ద మాత్రమే రోల్స్ రాయిస్ కులినన్ ఉంది. ఇప్పుడు వారి లిస్ట్ లో ఊర్వశీ కూడా చేరింది. దీంతో నెటిజన్స్.. ఊర్వశీ సంపాదన చూసి నోర్లు వెళ్ళబెడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar