Upasana Funny post on Valentines Day: వాలెంటైన్స్ డే సందర్భంగా మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వాలెంటైన్స్ డేపై ఓ ఫన్ని కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 14 కేవలం వారికి మాత్రమేనని సరదాగా ఓ కోట్ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “వాలంటైన్స్ డే కేవలం 22 ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే. మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అయితే.. ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వరకు ఎదురుచూడండి” అని రాసుకొచ్చింది. దీనికి స్మైలీ ఎమోజీని కూడా జత చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
కాగా మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే విషయం తెలిసింది. ఇక ఎప్పుడూ సీరియస్, సామాజిక అంశాలకు సంబంధించిన పోస్ట్స్ చేసే ఉపాసన వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఫన్నీ కామెంట్ చేయడం అందరిని సర్‌ప్రైజ్ చేస్తోంది. కాగా మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. రామ్ చరణ్, క్లింకారలకు సంబంధించిన ఫోటోలు, పోస్ట్స్ షేర్ చేస్తూ మురిసిపోతుంటుంది. మరోవైపు అపోలో హాస్పిటల్స్ వ్యవహరాలను కూడా చూసుకుంటూ సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తోంది.