Upasana About Marriage Life With Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన మెగా కోడలిగానే కాదు అపోల్ హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్‌గానూ తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇటూ కోడలిగా, భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఉపాసన తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన వైవాహిక బంధంతో, రామ్ చరణ్‌తో తన జీవిత ప్రయాణం గురించి చెప్పుకోచ్చింది.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. పెళ్లయిన కొత్తలోనే చరణ్‌కు, తనకు మంచి బంధం ఏర్పడిందని, ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామని చెప్పింది. “చరణ్ నన్ను ఎంతగానో సపోర్టు చేస్తాడు. నేను ఏదైనా చేయాలనుకుంటే దానికి సహాకరిస్తాడు. ఒడిదుడుకుల్లోనూ నా వెన్నెంటే ఉంటాడు. అలాగే చరణ్ కష్టానష్టాల్లోనూ నేను తనవైపు నిలుచుంటాను. ఒకరికొకరం ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటాం. అదే మా బంధం దృఢంగా ఉండటానికి ప్రధాన కారణం. ఆ బంధం అంతే బలంగా ఉండాలంటే భార్యభర్తలు ఎంత బిజీగా ఉన్న ఒకరికి ఒకరు సమయంలో కెటాయించుకోవడం తప్పనిసరి.
వారానికి ఒకసారైనా డేట్ నైట్‌కు వెళ్లమని మా అమ్మ చెప్తూ ఉండేది. మేము కూడా వీలైనంత వరకు అదే ఫాలో అయ్యేవాళ్లం. కుదరకపోతే బయటకు వెళ్లకుండ ఇంట్లోనే ఆ రోజంతా గడుపుతాం. ఆ రోజు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంటాం. మా మధ్య ఏదైన సమస్య వస్తే కూర్చోని మాట్లాడుకుంటాం. వైవాహిక బంధం బలంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. అప్పుడు పెళ్లిళ్లు వర్కౌట్ అవుతాయి. ఎప్పటికప్పుడు బంధాన్ని బలపర్చుకుంటూ ఉండాలి” అని చెప్పుకొచ్చింది.
అనంతరం కూతరు క్లింకార గురించి చెబుతూ.. “నేను నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగాను. నా కూతురు కూడా నాలాగే తాత-నానమ్మల దగ్గరే పెరగాలని కోరుకుంటున్నా. తాత-నానమ్మల చేతుల్లో పెరగడం ఒక మధురానుభూతి. క్లింకారను అత్తయ్య-మామయ్యలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నేను ఇంట్లో లేనప్పుడు తను సురక్షితమైన చేతుల్లోనే ఉందన్న ధీమా ఉంటుంది నాకు. మా అమ్మ-నాన్న కూడా క్లింకార చాలా ప్రేమగా, అప్యాయంగా చూసుకుంటారు. తన ఎదుగుదలలో మా కుటుంబసభ్యులంతా భాగమవుతున్నారు” అని పేర్కొంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదని, తనకు మాత్రం తన అత్త-మామలతోనే కలిసి ఉండటం ఇష్టమని చెప్పింది. తామంత ఒకే ఇంట్లో కలిసి ఉండటమే తనకు నచ్చుతుందని ఉపాసన చెప్పింది.