Prime9

Actor Allam Gopal Rao Died: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినీ-టీవీ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూత!

TV Actor Allam Gopal Rao Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటులు అల్లం గోపాలరావు (75) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో నేడు శనివారం(జూన్‌ 14) ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్‌ విషాదం నెలకొంది. ఆయన మరణానికి సినీ ప్రముఖుల సంతాపం ప్రకటిస్తున్నారు.

 

ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సోషల్‌ మీడియాలో వేదికగా ఆయన సహా నటీనటులు ఇతరులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా అల్లం గోపాలరావుకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్‌, సునీల్‌లు ఉన్నారు. ఆయన పెద్దకుమారుడు అనిల్‌ సీరయళ్లతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భౌతియక కాయాన్ని పలువురు సినీ, టీవీ నటులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar