Site icon Prime9

Prabhas Kalki Video Viral: ప్రభాస్‌పై ట్రోలింగ్‌ – ‘కల్కి’లో అదంతా ఫేకేనా?

Trolling on Prabhas Over Kalki Action Sequences: ప్రస్తుతం ప్రభాస్‌ మార్కెట్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ఉంది. భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తూ తన మార్కెట్‌ని భారీ పెంచుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌ ఇండియా నెంబర్‌ వన్‌ హీరో అనే విషయం తెలిసిందే. అతడి ప్లాప్‌ సినిమాలు కూడా రూ. 500 కోట్ల వసూళ్లు చేస్తున్నాయి. రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ బ్రేక్ చేస్తున్నాయి. ఇక హిట్‌ సినిమా అయితే వెయ్యి కోట్లు గ్యారంటీ. ప్రభాస్‌తో సినిమా అంటే అది ప్లాప్‌ అయినా నిర్మాతలకు మాత్రం నష్టపోరని నమ్ముతున్నారు. ఇక హిట్‌ టాక్‌ వస్తే లాభాల పంటే. అది బాహుబలి, సలార్‌, కల్కితో చూశాం. అందుకే ప్రభాస్‌తో సినిమా చేసేందుకు నిర్మాణ సంస్థలు ఎగబడుతున్నాయి.

ప్లాప్ మూవీకి కూడా కోట్లలో వసూళ్లు

ఒకేసారి అతడితో రెండు మూడు ప్రాజెక్ట్స్‌కి డిల్‌ కుదర్చుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌లోనూ రికార్డులన్ని బ్రేక్‌ చేశాడు. అక్కడి స్టార్‌ హీరోల పేరుతో ఉన్న రికార్డులన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మన సౌత్‌ సినిమాలు కూడా నార్త్‌లో సత్తా చాటుతున్నాయి. ఈజీ రూ.500 పైనే కోట్లు సాధిస్తున్నాయి. రీసెంట్‌ పుష్ప 2 అత్యధిక వసూళ్లు సాధించిన అక్కడ రికార్డు బద్దలు కొట్టింది. దీంతో నార్త్‌ మన నార్త్‌ హీరోలు, సినిమాలపై అక్కడి వారిలో అసూయ పెరిగింది. ఈ క్రమంలో తరచూ మన హీరోలను ట్రోల్‌ చేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్‌. తాజాగా ప్రభాస్‌పై ట్రోల్‌కి దిగారు. కల్కి చిత్రంలోని ఓ మేకింగ్‌ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ విమర్శిస్తున్నారు. వాటికి మన డార్లింగ్ ఫ్యాన్స్‌ కూడా గట్టి సమాధానం ఇస్తూ వారి నోళ్లు మూయిస్తున్నారు.

కల్కి వీడియో వైరల్

కాగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వచ్చి ‘కల్కి 2898 ఏడీ’ ఏ రేంజ్‌లో హిట్‌ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనెలు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో నాగ్‌ అశ్విన్‌ వండర్‌ క్రియేట్‌ చేశాడని, ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించాడంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలోని ప్రతి సీన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌ మధ్య సాగే ఫైట్‌ సీన్‌ ఫిదా అయ్యారు. కొన్ని క్షణాల పాటు ఆడియన్స్‌ కళ్లు ఆర్పనివ్వలేదు.

‘అదంతా ఫేకా?!’

ఉత్కంఠగా సాగిన ఈ యాక్షన్‌ ఎపిసోడ్ ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. అయితే దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియోని షేర్‌ చేస్తూ ప్రభాస్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ చేసిన ఫైట్‌ సీన్స్‌ అన్ని ఫేకేనా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ సీన్‌లో ప్రభాస్‌కి బాడీ డబుల్‌. డీప్‌ ఫేక్‌టెక్నాలజీ వాడినట్టు చూపించారు. అంతేకాదు అమితాబ్‌ బచ్చన్‌కి కూడా బాడీ డబుల్‌ వాడారు. చిన్న చిన్న యాక్షన్‌ కూడా ప్రభాస్‌ చేయలేకపోయాడా? దీనికి కూడా బాడీ డబుల్‌ వాడారు? అంటూ విమర్శిస్తున్నారు. దీనిపై డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోలకు బాడీ డబుల్ వాడటం సర్వసాధారణ విషయమని, సల్మాన్ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ల బాడీ డబుల్‌ వీడియోలు కూడా ఉన్నాయంటూ వారి కామెంట్స్‌ గట్టి సమాధానం ఇస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar