Producer KP Chowdary Suicide: టాలీవుడ్ విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి బలవన్మరణం చెందారు. గోవాలోని హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రెండేళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్ కేసులో కేపీ చౌదరి పేరు బాగా వినిపించింది. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన గతేడాది జూన్‌లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
ఆయన అరెస్ట్ తర్వాత టాలీవుడ్‌లో ప్రముఖు నటీనటుల పేర్లు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ వ్యవహరంలో టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఆయన ఆరెస్ట్‌తో సినీ సెలబ్రిటీలు భయం భయంగా బతికారు. కాగా కేపీ చౌదరి అరెస్ట్ తర్వాత ఆయన నుంచి నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్‌డేటా, వాట్సప్ చా అప్పట్లో ఈ వ్యవహరం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. డ్రగ్స్ కింగ్ పిన్, నైజీరియాకు చెందిన డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్‌తో కేపీ చౌదరి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ వ్యవహరం తర్వాత ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. రెండేళ్ల తర్వాత ఇలా ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలుచుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. ఆయన ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాల్సి తెలియాల్సి ఉంది.