Site icon Prime9

Indian 2 Movie: ఇండియన్-2లో టీమిండియా క్రికెటర్ యువీ తండ్రి

yuvraj singh father joined indian 2 movies cast

yuvraj singh father joined indian 2 movies cast

Indian 2 Movie: లోకనాయకుడు కమల్‌ హాసన్ గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతూ ‘విక్రమ్‌’ మూవీతో గ్రాండ్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు. దానితో ఇప్పుడు కమల్ కు మరల మంచి క్రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం అదే ఊపుతో కమల్‌, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్‌-2’ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ కూడా దానికి తగినట్టుగానే ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ అంశం యాడ్ అయ్యింది. భారత మాజీ క్రికెటర్‌ యవరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్‌ ఈ మూవీలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దానితో అటు సినీలవర్స్ కే కాకుండా ఇటు క్రికెట్ లవర్స్ కి కూడా ఈ సినిమాపై భారీ ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. ఈ విషయన్ని స్వయంగా యోగ్‌రాజ్ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. తనకు మేకప్‌ వేస్తున్న ఫోటోను షేర్‌ చేస్తూ కెమారా వెనుకు పనిచేసే అందరికీ ధన్యవాదాలని, తనను మరింత స్మార్ట్‌గా తయారుచేస్తున్న మేకప్ మేన్‌కు కృతజ్ఞతలంటూ పేర్కొన్నారు. కమల్‌ హాసన్‌తో ఇండియన్‌-2లో నటించడానికి పంజాబ్‌ సింహం సిద్ధంగా ఉంది అంటూ క్యాప్షన్ పెట్టి  నెట్టింట పోస్ట్ చేశాడు.

ఫుల్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం 1996లో వచ్చిన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్‌గా రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో జరగుతుంది. ఈ సినిమాలో కమల్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై సుభాస్కరణ్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తుండగా, అనిరుధ్ ఈ మూవీకి సంగీతం సమకూర్చుతున్నాడు.

ఇదీ చదవండి: హన్సిక పెళ్లి చేసుకోబోయే వరుడు ఇతడే.. ఫొటోలు రివీల్

Exit mobile version