Site icon Prime9

Green India Challenge : యాక్టర్ సముద్ర ఖని గ్రీన్ ఇండియా ఛాలెంజ్

actor samudrakhani participated in green india challenge

actor samudrakhani participated in green india challenge

Green India Challenge : పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి, గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం మొక్కలు నాటడమే. ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ భారీ ఎత్తున గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరూ పాల్గొంటూ పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నారు. తాము మొక్కలు నాటడమే కాకుండా ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మరోకరికి మొక్కలు నాటమని చెబుతూ సాగుతోన్న ఈ చాలెంజ్‌ ఓ ఉద్యమంలా నడుస్తోంది.

గతంలో ప్రముఖ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, తమిళ స్టార్ హీరో విజయ్ తదితరులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములయ్యి వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇచ్చారు.

అయితే తాజాగా అలా వైకుంఠపురం, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాల్లో ప్రతి నాయకుడిగా చేసిన సముద్రఖనికి తమిళ స్టార్ డైరెక్టర్ శశి కుమార్ ఈ ఛాలెంజ్ ని ఇవ్వగా సముద్రఖని ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటి ఫోటోలని తన ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ చేశారు. శశి కుమార్ తనకు ఇచ్చిన ఛాలెంజ్ ని పూర్తి చేసి, కొనసాగింపుగా తన కొడుకు హరి విగ్నేశ్వరన్, కూతురు ధియానా శివాని, సంక్రాంతికి విడుదల అవుతున్న తమిళ స్టార్ అజిత్ నటించిన తునీవు సినిమా డైరెక్టర్ వినోద్ కి ఈ ఛాలెంజ్ ఇచ్చారు.

Exit mobile version