Prime9

Actress Kalpika Ganesh: బర్త్‌డే పార్టీలో గొడవ – టాలీవుడ్‌ నటిపై పబ్‌ సిబ్బంది దాడి?

Actress Kalpika Ganesh Attacked By PUB Staff: నటి కల్పిక గణేష్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి వంటి చిత్రాల్లో సిస్టర్‌ రోల్స్‌తో మంచి గుర్తింపు పొందింది. తమిళ్‌లో హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో కనిపించి చాలా కాలం అవుతుంది. కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు పలు అంశాల్లో ఆమె వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా కల్పిక మరో వివాదంలో నిలిచింది.

 

పబ్‌లో ఆమె రచ్చ రచ్చ చేస్తూ కనిపించింది. తన బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఓ పబ్‌కి వెళ్లింది. అక్కడ బర్త్‌డే కేక్‌ విషయంలో పబ్‌ నిర్వాహకులతో ఆమెకు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కల్పిన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనపై పబ్ నిర్వాహకులు దురుసగా ప్రవర్తించారని, తనపై పబ్‌ సిబ్బంది దాడి చేశారని ఆమె ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రూవ్స్‌ లేవు. వారు దాడి చేసినట్టుగా ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాలేదు. అయితే పబ్‌ నిర్వాహకులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

దీనిపై వారు ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదని, పోలీసులు కూడా తనతో అలాగే ప్రవర్తించారని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కల్పిక రామ్‌ చరణ్ ఆరెంజ్‌ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ఇందులో జెనిలియా స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, యశోత వంటి చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో ఆఫర్స్‌ లేకపోవడం సినిమాలకు దూరమైంది.

Exit mobile version
Skip to toolbar