Tollywood Actor Tarun Raj Arrested in Gold Smuggling Case: కన్నడ హీరోయిన్ రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ ఎయిర్‌పోర్టులో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ హీరోని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. కాగా రన్యా రావు అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ఈ కేసులో ఆమె భర్త పేరు కూడా వినిపించింది. అలాగే మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి.
‘పరిచయం’ చిత్రంతో ఎంట్రీ
ఇప్పుడు హీరో తరుణ్ రాజ్ కొండూరుని అరెస్ట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. తరుణ్ రాజ్ హీరో 2018లో పరిచయం అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాతోనే అతడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తొలి చిత్రమే ఘోర పరాజయం పొందడంతో అతడి మళ్లీ హీరోగా అవకాశాలు రాలేదు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిమ్రత్ కౌర్ హీరోయిన్‌గా నటించింది. 2018 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అతడి పేరు వినిపించడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయ్యింది.
రన్యా రావు భర్త సంచలన కామెంట్స్
రన్యారావు అరెస్ట్ తర్వాత ఈ గోల్ట్ స్మగ్లింగ్ కేసులో సంచలనమైంది. మార్చి 3న బెంగళూరు పోలీసులు ఆమె అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆమె డీఆర్‌ఐ కస్టడీలో ఉంది. అయితే రన్యారావు గత నవంబర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త జతిన్ హుక్కేరితో పెళ్లి జరిగింది. అయితే భార్య అరెస్ట్‌తో జతిన్‌ని పోలీసులు అనుమానిస్తూ అతడిని విచారిస్తున్నారు. ఈ విచారణలో అతడు షాకింగ్ విషయాలు వెల్లడించారు. రన్యాకు తను పెళ్లయిన నెల నుంచి వేరుగా ఉంటున్నామని చెప్పాడు. తాము అధికారికంగా విడిపోలేదన్నాడు. కానీ, వేరు వేరుగా నివసిస్తున్నట్టు అతడు పోలీసులకు తెలిపాడు.