Site icon Prime9

Vishwak Sen: హీరో విశ్వక్‌ సేన్‌ ఇంట భారీ చోరీ!

theft at hero Vishwak Sen house: ‘మాస్‌ కా దాస్‌’ విశ్వక్‌ సేన్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు ఆయన తండ్రి సి రాజు ఫిలింనగర్‌లోని పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. “ఫిలింనగర్‌లోని రోడ్డు నెంబర్‌ 8లో విశ్వక్‌ సేన్‌ నివాసం ఉంటున్న సంగతి తెలిసింది. ఇంటిలోని మూడో అంతస్తులో విశ్వక్‌ సోదరి నివసిస్తుంది. తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని ఆమె గుర్తించి తన తండ్రికి విషయం చెప్పింది.

అనుమానం వచ్చి ఇళ్లంతా వెతికి చూడగా రెండు బంగారు డైమండ్‌ రింగ్స్‌, ఒక హెడ్‌ఫోన్‌ మిస్‌ అయినట్టు గర్తించారు. దీంతో విశ్వక్‌ సేన్‌ తండ్రి సి రాజు ఫిలింనగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలంచారు. క్లూస్‌ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటీ సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ఇంట్లోకి చొరపబడినట్టు తెలిసింది. ఉదయం 5.50 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు బైక్‌ పార్క్‌ చేసినట్టుగా గుర్తించారు.

ఆ తర్వాత అతడు గేటు తీసుకుని నేరుగా మూడవ అంతస్తుకు వెళ్లి వెనక డోర్‌ నుంచి బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించిన అల్మరా నుంచి బంగారు వస్తువులు దొంగలించినట్టు గుర్తించారు. 20 నిమిషాల్లోనే ఇదంత జరిగింది. చోరికి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. 2.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version
Skip to toolbar