Site icon Prime9

Varasudu Movie : యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న విజయ్ “వారిసు” ట్రైలర్… తెలుగులో కూడా !

thalapathy vijay varisu movie trailer trending on youtube

thalapathy vijay varisu movie trailer trending on youtube

Varasudu Movie : తమిళ స్టార్‌ హీరో విజయ్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కించిన చిత్రం ‘వారిసు’. తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి తెలియనిది కాదు. ఇక తెలుగులోనూ ఆయన మార్కెట్ పెరుగుతూ పోతోంది. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా… ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అభిమానులకు ఫుల్ గా నచ్చేశాయి. యూట్యూబ్ లో ఈ కూడా ఈ సినిమా పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.

తమిళ్ సినిమా అయినప్పటికీ మన దగ్గర కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించారు. ఇక ఈ సినిమాలో శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ, హీరో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 11 వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా తమిళ్, తెలుగు ట్రైలర్ లను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో ఉమ్మడి కుటుంబానికి చెందినవాడు. అతను ఇంటికి దూరంగా తనకు నచ్చిన ప్రపంచంలో బ్రతుకుతుంటాడు. తన ఫ్యామిలీకి బిజినెస్ లో శత్రువులు పెరిగారని తెలిసి విజయ్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో మనస్పర్థల కారణంగా విడిపోయిన తన కుటుంబాన్ని విజయ్ కలుపుతాడు. విలన్ ని ఎదిరించి తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడనేదే కథ అనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుందని చెప్పాలి.

Exit mobile version