Site icon Prime9

Thalapathy Vijay : వారి గురించి వీలైనంత ఎక్కువ చదవమంటున్న దళపతి విజయ్.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా ?

thalapathy vijay interesting words about ambedkar and periyar

thalapathy vijay interesting words about ambedkar and periyar

Thalapathy Vijay : తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి ”విజయ్” కి సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి ఫుల్ గా అభిమానులు ఉన్నారు. స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్, వారసుడు వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా విజయ్ మరింత చేరువయ్యాడు అని చెప్పాలి. ప్రస్తుతం లోకేష్ దర్శకత్వమల “లియో” సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విజయ్ తాజాగా చెన్నై లో ఈ ఏడాది 10, 12 తరగతుల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ మేరకు ఆ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి, మద్రాస్ స్టేట్ కామరాజ్ వంటి నాయకుల గురించి వీలైనంత ఎక్కువ చదవాలని విద్యార్థులకు సూచించారు. సాధ్యమైనంత వరకు, ప్రతిదాని గురించి చదవండి. చదివిన దాని నుంచి ఏది మంచిదో దాన్ని తీసుకోండి, మిగిలింది వదిలివేయండి అని అన్నారు. అలానే పరీక్షల్లో ఫెయిల్ అయిన మీ స్నేహితులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పండి. మీకు అవసరమైనవి అందకుండా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారు మీ చుట్టూనే ఉంటారు. వారిని పట్టించుకోకుండా మీ మనసు చెప్పే మాటలు వినండి అని తెలిపారు.

నేను(Thalapathy Vijay) నటుడిని అవ్వాలని అనుకున్నాను. నా కల సినిమా. ఆ బాటలోనే నా ప్రయాణం సాగిందని చెప్పుకొచ్చారు. విద్యకు ఉన్న శక్తి గురించి ఈ మద్య ఒక డైలాగ్ విన్నాను. ‘మిగతావన్నీ మీ నుంచి దొంగిలిస్తారు, కానీ మీ దగ్గర ఉన్న విద్యను ఎవరూ దొంగింలించలేరు’ అన్న ఆ డైలాగ్ నన్ను కదిలించింది. ఆ మాట వాస్తవం.. అందుకే చదువు కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. దానికి ఇదే సమయం అని నా నమ్మకం అని వెల్లడించారు. ఓటు వేయడం గురించి కూడా మాట్లాడుతూ “మీరే భావి ఓటర్లు. రాబోయే రోజుల్లో మంచి నాయకులను ఎన్నుకునేది మీరే. ప్రజలు కూడా ఓటుకు డబ్బు తీసుకుంటున్నారు. ఓటుకు రూ.1,000 ఇస్తున్నారు. అంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే ఆ వ్యక్తి ఇంతకు ముందు ఎంత సంపాదించాడో ఊహించండి. ఈ విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. మన విద్యా విధానంలో ఇలాంటివి బోధించబడాలని నేను కోరుకుంటున్నాను” అని విజయ్ చెప్పారు. గత కొంతకాలంగా విజయ్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయాలని యోచిస్తున్నట్లు ఆయనకు సన్నిహిత వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా విజయ్ ఈ విధంగా మాట్లాడడంతో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు మరింత బాలపడ్డాయి.

Exit mobile version