Comedian Mahesh Vitta Shared His Wife Pregnant Photos: మహేష్ విట్టా.. ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. ఫన్ బకెట్ వీడియోలతో యూట్యూబ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు ప్రస్తుతం నటుడిగా వెండితెరపై రాణిస్తున్నాడు. రాయలసీమ యాసలో మాట్లాడుతూ నెటిజన్స్‌ని ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఆ క్రేజ్‌తో సినిమా అవకాశాలు అందుకున్న అతడు తనదైన కామెడీతో వెండితెరపై అలరిస్తున్నాడు.
అంతేకాదు బిగ్‌బాస్ షోకి రెండుసార్లు వెళ్లిన మహేష్ విట్టా త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నాడు. అతడి భార్య శ్రావణి ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉంది. ఈ మేరకు బేబీ షవర్ ఫోటోలను షేర్ చేశాడు. “త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం. త్వరలోనే మాతో ఓ బుచ్చి పాపాయి జాయిన్ కాబోతుంది. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ షేర్ చేశాడు. దీంతో అతడి నెటిజన్స్, ఫ్యాన్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా ఫన్ బకెట్ అనే ఫన్నీ సిరీస్‌తో యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ విట్టా.. ఆ క్రేజ్‌తో బిగ్‌బాష్ ఆఫర్ కొట్టేశాడు.
బిగ్‌బాస్ 3వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని కొన్ని వారాల పాటు అలరించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లోనూ సందడి చేశాడు. ఇలా బుల్లితెరపై గుర్తింపు పొందిన అతడు ఆ తర్వాత వెండితెరపై తనదైన కామెడీతో అలరించాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండగా తన ప్రేమ గురించి బయటపెట్టాడు. శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, త్వరలో తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చెప్పినట్టుగానే 2023లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నామంటూ ఫ్యాన్స్‌తో గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. కాగా మహేష్ విట్లా సినిమాల విషయానికి వస్తే.. కృష్ణార్జున యుద్దం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ వంటి తదితర చిత్రాల్లో నటించాడు.