Site icon Prime9

Karthika Deepam: నవంబర్ 14 ఎపిసోడ్ లో మోనిత దీపని చంపుతుంటే పట్టుకున్న కార్తీక్!

karthikadeepam

Karthika Deepam Today: నేటి  కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. కార్తీక్ కి నా ప్రేమంటే విలువ లేకుండా పోయింది. నీకు నేనంటే భయం లేకుండా పోయింది. ఇక మీ ఇద్దరిలో ఒకరు పైకి పోవడం ఖాయం అని మోనిత దీపతో అంటుంది. దాంతో దీప ఇప్పటి వరకు నువ్వు ఏం చేసిన ఎందుకు భరిస్తున్నానో తెలుసా మోనిత, డాక్టర్ బాబు క్షేమంగా ఉన్నారన్న కారణంతో, ఆయనకేమైన కీడు తలపెట్టాలని చూస్తే, నిలువునా చీరేస్తాను అని మోనితకి దీప వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు హిమ,ఆనందరావు శౌర్య గురించి మాట్లాడుకుని బాధపడతారు. దీప దీపాలు చెరువులో వదిలాడనికి వస్తే, వెనుకే మోనిత కూడా వస్తుంది. అయితే దీప దీపాలు వదలడానికి వంగుతుంటే మోనిత తోసేయడానికి చూస్తుంది. వెంటనే కార్తీక్ వచ్చి తనని ఆపి, పక్కకి తీసుకొస్తాడు. ఏమి చేస్తున్నావో అర్దం అవుతోందా అని కోపంగా అంటాడు. అప్పుడు మోనిత నాకు నువ్వు నాకు కావాలి కార్తీక్, నీకోసం ఏమైనా చేస్తాను. అందుకే వంటలక్కతో మాట్లాడనని మాటివ్వు కార్తీక్,లేకపోతే నన్ను నేను తగలబెట్టుకుంటాను అని మోనిత కోపంగా అంటుంది. కార్తీక్ మౌనంగా ఉంటే, దీప కోపంగా తగలబెట్టుకోవే, తగలబెట్టుకో, డాక్టర్ బాబు నన్ను కలుస్తారు. మాట్లాడతారు. అంత చూడలేకపోతే తగలబెట్టుకో చేతులు రావట్లేదా, ఉండు నేను తగలబెడతాఅంటూ మోనిత చేతిలోంచి దీపాన్ని లాక్కుంటుంది దీప. వెంటనే మోనిత దీప చెవి దగ్గరకు వెళ్లి, నన్ను తగలబెడతావా? గుడిలో ఉండి చెబుతున్నాను. రేపు ఈ పాటికి, నువ్వో ఈ డాక్టర్ బాబో ఇద్దరిలో ఎవ్వరో ఒక్కరే ఉంటారు. నాకు దక్కని వాడ్ని నీకు దక్కనివ్వను అంటుంది మోనిత. దీప మళ్లీ నా డాక్టర్ బాబు ఊసెత్తుతావా, మోనిత నిన్ను తలబెట్టేస్తానే అంటుంది కోపంగా, అప్పుడే శివలత మోనితని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తుంది.

సీన్ కట్ చేస్తే, శౌర్య ఇంద్రుడు, చంద్రమ్మ గురించి ఆలోచిస్తుంటే, వాళ్ళు కావాలని వచ్చి శౌర్యకు వినేలా మాట్లాడుతూ ఉంటారు. ఆటో అమ్మేశాం కదా వాళ్ళ శౌర్య అమ్మానాన్నని వెతకడం ఇష్టం లేక అలా చేశాను అనుకుంటుంది అని అంటాడు. వాళ్ళ మాటల విన్న శౌర్య బాధపడుతూ మీ గురించి ఇక తప్పుగా ఆలోచించను బాబాయి అని సారి చెప్తుంది.

దీప గుడిలో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, డాక్టర్ బాబు టిఫిన్ తీసుకొచ్చి తినమని ఇస్తాడు.అప్పుడే మోనిత చూసీ, టిఫిన్ తీసుకొస్తుంటే ఎవరి కోసమే అనుకున్నా దీప ఉపవాసం తీర్చడానికా అని అనుకుంటుంది.నేనూ ఉపవాసం ఉన్నా కానీ నా గురించి పట్టించుకోకుండా దీప దగ్గరకు వెళ్తావా,కార్తీక్ నీకు గతం గుర్తుకు వచ్చిందని నాకు చాలా అనుమానంగా ఉంది. అదేంటో త్వరలోనే తేలుస్తా అని అనుకుంటుంది.

Exit mobile version