Site icon Prime9

Karthika deepam: సెప్టెంబర్ 17 దెబ్బకు దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన దీప

karthika-deepam sep 17 prime9news

karthika-deepam sep 17 prime9news

Karthika deepam: నేటి కార్తీక దీపం సీరియల్లో ఈ రెండు సీనులు హైలెట్. ఇంద్రుడు సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు. పక్కింటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. దాని కోసమే ఇన్ని సరుకులు తెప్పించానని చంద్రమ్మ అంటుంది. ఆ మాటలు విన్న సౌర్యకు వాళ్ళ అమ్మ దీప గుర్తొచ్చి మా అమ్మ కూడా నీలానే పిన్నీ వంటలు చేసేదంటూ మాట్లాడుతూనే చంద్రమ్మ చేతిలో ఉన్న సరుకుల లిస్ట్ బుక్ చూడగానే షాక్ అవుతుంది. పిన్నీ ‘ఇది అచ్చం మా అమ్మ చేతి రాతలాగే ఉంది. ఇది ఎవరు రాశారని చంద్రమ్మను అడగగా ‘ఇందాక ఆటో ఎక్కిన ఒక ఆవిడ రాశారమ్మా’ అని ఇంద్రుడు చెబుతాడు. ఈ బుక్ లో రాత, మా అమ్మ చేతి రాత ఒకేలా ఉన్నాయి అంటే, ఆవిడే మా అమ్మ అయి ఉంటుంది. మా అమ్మ బ్రతికే ఉందని బలంగా నమ్ముతూ స్క్రీన్ లో ఎమోషనల్ ఐనట్టు కనిపిస్తుంది.

దెబ్బకు దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన దీప..

దీప రావడం చూసిన శివ, దీపను వెళ్ళనివ్వకుండా అడ్డుపడతాడు. ఇంతలో దీప, కార్తీక్ పాడుతున్న పాట వినపడటంతో “మా డాక్టర్ బాబు ఇక్కడే ఉన్నారు” అని అనుకుటుంది. ఇంకో వైపు శివ ‘మేడమ్ ఊరిలో లేరు. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి లేకపోతే నా ఉద్యోగం పోతుంది ప్లీజ్, ఇక్కడ నుంచి వెళ్ళు వంటలక్కా, మా మేడమ్ చెన్నై వెళ్లింది. రేపొద్దుటి వరకు ఇక్కడికి వచ్చేస్తారంటూ దీపని అక్కడ నుంచి బలవంతంగా పంపించేస్తాడు. దీప అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ‘ఇది సంగతి అన్నమాట అది చెన్నై వెళ్తూ, నేను డాక్టర్ బాబుని కలవకుండ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. మోనితా నన్ను రెచ్చగొట్టావ్ కదా. ఇక నీకు చుక్కలే అని మనసులో అనుకొని వెళ్ళిపోతుంది.

Exit mobile version