Karthika Deepam: అక్టోబర్ 31 ఎపిసోడ్ లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న మోనిత

టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ నేటి ఎపిసోడ్‌ హైలైట్స్ చూద్దాం.

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 02:41 PM IST

Karthika Deepam Today: నేటి  కార్తీక దీపం ఎపిసోడు లో ఈ రెండు సీన్లు హైలెట్. ఇక దీప, కార్తీక్‌లు ఇంద్రుడు దగ్గరకు చాలా ఆత్రంగా వెళతారు. సౌర్యని చూడబోతున్నందుకు ఇద్దరూ సంతోషంగా బయలుదేరతారు. ఐతే ఇంద్రుడు మాత్రం మౌనంగా, బాధగా ఉంటాడు. వాళ్లని తీసుకురావడానికి వెళ్లడు. చంద్రమ్మతో మాట వరసకు ‘చంద్రమ్మా.. మన జ్వాలమ్మ మన నుంచి దూరంగా వెళ్లిపోతే నువ్వు ఉండగలవా అని అడుగుతాడు. ‘అయ్యో మనం చేసేది పుష్పవతి ఫంక్షన్ మాత్రమే, పెళ్లి, అప్పగింతలు కాదు జ్వాలమ్మ మనల్ని వదిలి వెళ్ళి పోవడానికి, నువ్వు ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావ్? అయినా ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకు’ అనేసి ఇంద్రుడు మాటలను చంద్రమ్మ కొట్టిపారేస్తుంది.

‘ఇంతకాలం నా చేతికి మట్టి ఎందుకని వాళ్లని వీళ్లని పెట్టాను. నిన్ను చంపడం కోసం ఈ సారి నిన్ను నేనే లేపెస్తాను. నువ్వు చచ్చాక నేను కార్తీక్ హ్యాపీగా ఉంటామే’ అంటూ గన్ తీసుకొని పెద్ద పెద్దగా మోనిత అరుస్తుంది. వెంటనే శివ, మోకాళ్ల మీద కూర్చుండి ‘మేడమ్, మేడమ్ నేను వంటలక్కని కాదు. శివని మేడమ్, మీ శివాని మేడమ్, వంటలక్క మీద కోపంతో నన్ను చంపొద్దు మే….డ….మ్’ అంటూ శివ అల్లాడిపోతాడు. ఒరేయ్ “నువ్వు ఎందుకొచ్చావ్ రా ” నేను పిచ్చి ఎక్కి ఉన్నానని నీకు తెలుసు కదా? ఎందుకొచ్చావ్’ గట్టిగా అని అరుస్తుంది మోనిత. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.