Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్ 25 ఎపిసోడ్ లో దీప వైపు అడుగులేస్తున్న కార్తీక్ బాబు

karthika deepam oct 25 prime9news

karthika deepam oct 25 prime9news

Karthika Deepam: నేటి కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

‘మారింది నేను కాదు నువ్వే…అని కార్తీక్ కావాలని అంటాడు.ఆ మాటలకు మోనితకు బాగా కోపం వస్తుంది.‘కార్తీక్ నా మనసులో జీవితంలో ఉన్నది నువ్వు మాత్రమే..నన్ను అన్ని మాటలు అంటున్నావ్ కానీ.. నువ్వు చేసేది ఏంటీ చెప్పు ? నువ్వు కూడా ఆ వంటలక్కతో తిరగట్లేదా?’ అంటూ రివర్స్‌లో మోనిత..కార్తీక్‌ మీద ఒక రేంజులో ఫైర్ అవుతుంది.‘మోనితా వంటలక్కని మాత్రం నువ్వు ఏం అనొద్దు.. ప్రశాంతత దొరికిన చోట కాసేపు ఉండటంలో తప్పేం లేదు..’ అని కోపంగా అంటాడు.అంటే నేను రోజు రోజుకి నీకు ఒక రాక్షసిలా కనిపిస్తున్నానా?’ అంటూ అరుస్తు మోనిత అంటుంది.కార్తీక్ విసిగి పోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.‘మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావ్’ అని మోనిత అంటుంది.నా ‘ప్రశాంతత దగ్గరకు’ అని అంటాడు కార్తీక్,ఆ మాటలకు మోనిత హై బీపీ తెచ్చుకుంటుంది.

ఇక రాత్రి అయ్యాక దుర్గతో కలిసి వాల్తేరు వాణి కలిసి వాకింగ్‌కి వెళ్తుంది.‘దుర్గా నీకో విషయం చెప్పనా? నువ్వు మోనితని టార్చర్ చేశావని తెలిశాక నీ మీద నాకు పిచ్చ అభిమానం పెరిగిపోయింది తెలుసా?’ అంటూ పులిహోరకలపడానికి ప్రయత్నం చేసింది.‘చూడు వాణీ..’ అంటూ దుర్గ ఏదో విషయం చెప్పబోతుంటే..‘వాల్తేరు వాణి..అని దుర్గ అనగా అప్పుడు వాల్తేరు వాణి అని నన్ను నువ్వు పిలిస్తే నాకు చాలా ఇష్టం దుర్గా’ అని అంటుంది. ‘అలవాటు చేసుకుంటానులే..గాని నాకు వాణి అంటేనే చాలా ఈజీగా ఉంది’ అని అంటాడు దుర్గ. ఆ మాటలకు మేడమ్ గారికి కోపం వచ్చేస్తుంది.

ఇదీ  చదవండి :Gruhalakshmi: అక్టోబర్ 25 ఎపిసోడ్ లో ఏకాంతంగా మాట్లాడుకున్న సామ్రాట్, తులసి!

Exit mobile version