Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్19 ఎపిసోడ్ లో దీప కోసం ఇల్లు క్లీన్ చేస్తానంటున్న డాక్టర్ బాబు

karthika-deepam oct 19 prime9news

karthika-deepam oct 19 prime9news

Karthika Deepam: నేటి కార్తీక దీపం ఎపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్

కొన్ని అనుకోని కారణాలు వల్ల కొన్నాళ్లుగా ఇక్కడే ఉన్నాను.. ఇంకా చెప్పాలంటే కొంత కాలం ఇక్కడే ఉండే అవకాశం కూడా ఉంది.అందుకే మీ దగ్గర ఏమైనా సర్జరీలు ఉంటే చెప్పండి డాక్టర్ నేను చేస్తానని డాక్టర్ అని కార్తీక్ అంటాడు.‘తప్పకుండా..మీలాంటి వాళ్లు మా అదృష్టం అని డాక్టర్ అంటాడు.ఇక కార్తీక్ కోసం.. ఓ పక్క దీప.. మరోపక్క మోనిత ఇద్దరూ వేరువేరుగా ‘కార్తీక్ ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు?’ అంటూ ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు.కొంత సేపటికి కార్తీక్ రాగానే.. మోనిత ‘కార్తీక్ ఎక్కడికి వెళ్లావ్.. నీకు ఇంతకముందు ఎవరో ఫోన్ చేశారు ఎవరు వారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.అదా ‘నా ఫ్రెండ్ కాల్ చేశాడంటూ అబద్దం చెబుతాడు కార్తీక్.

Read Also: అక్టోబర్18 ఎపిసోడ్ లో మోనిత చెంప పగలకొట్టిన దీప

ఇల్లు క్లీన్ చేస్తానంటున్న డాక్టర్ బాబు

దీప ఇల్లంతా శుభ్రంగా లేదు..నేను క్లీన్ చేస్తానంటూ..డాక్టర్ బాబుకి కూడా ఇలా ఉంటే ఇష్టం ఉండదు..’ అంటూ తన అన్నయ్య డాక్టర్ హేమచంద్రతో అంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ‘హేమచంద్రగారు’ అని పేరు పెట్టి మరీ పిలిచి..నవ్వుతూ దీప అన్నయ్యని పలకరిస్తాడు కార్తీక్.ఆ సమయంలో దీప, దీప వాళ్ల అన్నయ్య ఇద్దరూ షాక్ అవుతారు. ‘ఏంటి అలా చూస్తున్నారు.. పేరు సరిగ్గా పిలవలేదా ? నాకు ఈ మధ్య అన్ని బాగానే గుర్తుంటున్నాయని కార్తీక్ అంటాడు.‘వంటలక్కా..నువ్వు ఎక్కువగా ఆలోంచించకు..తలోచేయి వేస్తే ఇళ్లు మొత్తం శుభ్రమైపోతుంది అంతే కదా..’ అంటూ బూజుకర్ర కార్తీక్ అందుకుంటాడు.తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version