Site icon Prime9

Karthika Deepam: నవంబర్ 02 ఎపిసోడ్ లో నిజం తెలుసుకున్న దీప!

karthika deepam nov 02 prime9news

karthika deepam nov 02 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ఇంటికి వెళ్లిన దీప, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ‘బాధపడొద్దు దీపమ్మా, నీ కూతురు అనుకుని వెళ్లావ్ కానీ, ఇప్పుడు కాదని తెలిసింది ఏం చేస్తావ్? అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎలా అవుతుంది త్వరలోనే మన సౌర్య మనకు దొరుకుతుందిలే’ అంటూ దుర్గ ఓదారుస్తాడు. ‘నా జీవితంలో ఏది అనుకున్నట్లు జరగడం లేదు దుర్గా. అన్ని కాకపోయిన కొన్ని ఐనా జరగాలి కదా అంటూ అల్లాడిపోతుంది దీప. ‘దీపమ్మా, ముందు ఇక్కడ మోనితని తప్పించి, డాక్టర్ బాబుకి అసలు నిజం తెలిసేలా చేస్తే చాలు. మీకున్న సగం సగం సమస్య తీరిపోతుంది. బాధ పడొద్దు దీపమ్మా’ అంటూ దుర్గ ధైర్యం చెబుతాడు అప్పుడే దీప కళ్లు తుడుచుకుని, ‘వాణీ ఏది పొద్దున్నుంచి కూడా కనిపించలేదు’ ఎక్కడకు వెళ్ళిందని ఆడగుతుంది.

‘మీరు సౌర్య కోసం కంగారుగా వెళ్తున్నారని మీకు చెప్పలేదు. వాల్తేరు వాణి మోనిత మీద పగ పెంచుకుని ఇక్కడకు రాలేదు దీపమ్మా, నిన్ను, నన్ను చంపడానికి వచ్చింది’ అని అంటాడు దుర్గ. ఆ మాటకు దీప షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా పైకి లేచి, ‘అదేంటి దుర్గా?’అసలు ఏమి జరుగుతుందని అడగగా ‘నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా దీపమ్మా’ అంటూ వాల్తేరు వాణి ఇంటికి నిప్పు అంటించబోతే, నేను చూసి ఆపేశానంటూ అంతా వివరంగా చెబుతాడు. తరువాత ఏం జరగనుందో రేపటి ఎడపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version
Skip to toolbar