Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్ 27 ఎపిసోడ్ లో ఎమోషనల్ అయిన దీప

karthika deepam oct 27 prime9news

karthika deepam oct 27 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. కార్తీక్, సౌర్యని వెతుకుతూ మార్కెట్ వైపు వెళతాడు. అక్కడే చాలా మందిని అడుగుతూ ఉంటాడు. ‘ప్రతిరోజు కాకుండా, అప్పుడప్పుడు పండగలకు మాత్రమే ఇక్కడకు సరుకులు తెచ్చి అమ్మేవాళ్లు ఎప్పుడొస్తారని వాళ్ళని అడుగుతాడు. ‘గతంలో వినాయకచవితికి వినాయకుడి బొమ్మలు అమ్మినట్లే, ఇప్పుడు దీపావళికి దీపాలో, టపాసులో ఇలా ఏవో ఒకటి అమ్మడానికి సౌర్య ఇక్కడికి వస్తుందని కార్తీక్ గట్టిగా నమ్ముతాడు.అలానే ఆలోచించుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళతాడు. ‘అమ్మా సౌర్యా నువ్వు ఎక్కడున్నావ్ తల్లి? ఎవరి దగ్గర ఉన్నావ్?’ అంటూ మనసులోనే బాధ పడతాడు.

‘అమ్మా నాన్న ఎక్కుడున్నారు? అని రాసున్న ఆటో నీదే కదా?’ అని కార్తీక్ అంటాడు. ‘అవును సార్ అదిగో నా ఆటో’ అని ఇంద్రుడు అంటాడు. ‘ఆ రోజు పాపతో ఫోనులో ఈ ఆటోలోనే మాట్లాడాను’అని దీప అంటుంది. ‘అవునమ్మా, మా జ్వాలమ్మ కూడా మిమ్మల్ని చూడటానికి తెగ ఆశపడుతుంది. మొన్నటి దాకా నాతో తిరుగుతూ ఉండేది. కానీ, మొన్నే పెద్దమనిషి అయ్యింది. రేపు మా జ్వాలమ్మకు నీళ్లు పోస్తున్నాం. ఫంక్షన్ చెయ్యాలి అందుకే డబ్బు దొంగతనం చేశాను. కానీ తనకు ఈ దొంగతనాలంటే అసలు ఇష్టం ఉండదు. అందుకేనేమో దొరికేశాను’ అని ఇంద్రుడు అంటాడు. ఇంద్రుడు మాటలు వినగానే, ‘పాప పెద్దమనిషి అయ్యిందా?’ అంటూ దీప కొంచం ఎమోషనల్ అయి వల్ల సౌర్యని గుర్తుకు తెచ్చుకుంటుంది.

Exit mobile version