Site icon Prime9

Karthika Deepam: నవంబర్ 01 ఎపిసోడ్ లో దీప, కార్తీక్ ఆశలు అడియాసలయ్యాయి!

karthika deepam nov 01 prime9news

karthika deepam nov 01 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం  ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. సౌర్య బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే ‘దిష్టి తగులుతుంది నువ్వు బయటికి రావద్దు ’ అంటూ చంద్రమ్మ మిగిలిన పేరంటాలతో కలిసి ఓ గదిలోకి కావాలనే పంపిస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చిన చంద్రమ్మ దీపని చూడగానే, నవ్వుతూ పలకరిస్తుంది. ఈమె ‘నా భార్య సార్’ అంటూ కార్తీక్‌కి చంద్రమ్మని పరిచయం చేస్తాడు ‘ఈవిడ’ అని దీపమ్మా అని పరిచయం చేయబోతుంటే, ‘ఈవిడ నాకెందుకు తెలియదు. నాకు ఒకసారి వాటర్ బాటిల్ కొనిచ్చారు కదా’ అని అంటుంది. ‘అమ్మగారు పాపని చూస్తాను అంటున్నారు ఒక్కసారి తీసుకొస్తావా?’ అని ఇంద్రుడు అంటాడు. దాంతో చంద్రమ్మ ‘ఒక్క నిమిషం గండ’ అంటూ లోపలికి వెళ్తుంది.

కొంత సేపటికి చంద్రమ్మ వేరే అమ్మాయిని తీసుకొచ్చి, ఇంద్రుడికి కూడా షాకిస్తుంది. నేను బిడ్డను కనడానికి ఎన్నో బాధలు పడ్డా ‘బిడ్డ పుట్టి పురిటిలోనే చనిపోతే, ఎన్నో దేవుళ్ళకు మొక్కులు మొక్కితే నాలుగేళ్లకు పుట్టిన బిడ్డమ్మా ఇది’ అంటూ ఒక కట్టు కథ అప్పటికప్పుడు అల్లింది. అప్పటి దాకా కొండంత ఆశతో ఉన్న దీప, కార్తీక్ ఇద్దరూ ఒక్కసారి కుప్పకూలిపోతారు. దీప ఆవేదన మామూలుగా ఉండదు. ‘ఈ అమ్మాయా మీ అమ్మాయి’ అని అడగగా, ‘అవునమ్మా ఆ రోజు బాటిల్ కొనిచ్చింది ఈ పాప కోసమే, థాంక్స్ చెబుతాను అన్నావ్ కదమ్మా. ఇప్పుడు చెప్పు’ అని అంటుంది ఆ పాపతో చంద్రమ్మ అంటుంది. ‘థాంక్స్ ఆంటీ’ అంటుంది ఆ పాప. అంత బాధలో కూడా దీప, ఆ పాప మాటలకు ఏమి చెప్పాలో తెలియయక నవ్వుతూ తల ఊపుతుంది.

Exit mobile version