Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్ 26 ఎపిసోడ్ లో మనకు నిజంగా పెళ్ళి అయిందా ? అని మోనితని అడిగిన కార్తీక్ !

karthika deepam oct 26 prime9news

karthika deepam oct 26 prime9news

Karthika Deepam: నేటి  కార్తీకదీపం  సీరియల్ ఎపిసోడ్లో ఈ రెండు సీన్లు హైలెట్

ఇక కార్తీక్.. మోనిత ఇంటి ముందు, దీప తన ఇంటి ముందు కూర్చుని.. వాళ్లల్లో వాళ్లే బాగా ఆలోచిస్తూ అల్లాడిపోతూ ఉంటారు.ఇక ‘లాభం లేదు.. నేను మౌనంగా ఉంటే దీపకు, సౌర్యకు న్యాయం జరగదు..ఈ రోజు నుంచే మోనితని బయటికి పంపించే ప్లాన్స్ ఆలోచించాలని కార్తీక్ ఆలోచిస్తాడు.‘నా భర్తని నా కళ్లముందే లాక్కునిపోతుంటే నేను ఏం చెయ్యలేకపోతున్నాను.. ఎలాగైనా ఆ మోనిత దగ్గర నుంచి నా కార్తీక్ బాబును తెచ్చుకుంటాను..’ అని దీప ఫిక్స్ అవుతుంది. దీప కళ్లు తుడుచుకొని తనకు తానే ధైర్యం తెచ్చుకుటుంది.కార్తీక్ ఆవేశంగా మోనిత దగ్గరకు వెళ్తాడు.

నా దగ్గర చాలా మంది పని చేసి ఉంటారు కదా కార్తీక్.. అలా నేను నేను మరిచిపోయి ఉంటాను అంతే..’ అంటూ మోనిత ఒక నవ్వు నవ్వుతుంది.‘మరిచిపోయావా? అలా ఎలా మర్చిపోతావ్ ? అసలు గతం మరిచిపోయింది నువ్వా నేనా?’ గట్టిగా అరిచి మోనితను, కార్తీక్ అడుగుతాడు.‘నార్మల్ మనుషులు కూడా అన్నీ గుర్తు పెట్టుకోలేరు కదా కార్తీక్’ అంటూ లాజిక్ మాట్లాడుతుంది మోనిత.ఓహో ‘అలా అంటావా.. పైగా మన పెళ్లి జరిగిందని ప్రియమణికి చెబితే..అసలు మీ పెళ్లి ఎప్పుడు జరిగిందని అంటుందేంటీ? పెళ్లి ఐతే మేడమ్ నన్ను ఎందుకు పిలవకుండా ఉంటుంది సార్ అని అన్నది తను…అంటే దీని బట్టి చూస్తే మనకు నిజంగా పెళ్ళి అయిందా ?  అని కార్తీక్ సూటిగా మోనితను అడుగుతాడు. ‘అయ్యో.. పెళ్లి కాకుండా మనకి బాబు ఎలా పుడతాడు కార్తీక్.?ఐనా ఆ సమయంలో తను నాకు గుర్తు లేదు.. గుర్తుంటే ఖచ్చితంగా పెళ్లికి కూడా పిలిచే ఉండేదాన్ని కదా?’ అని మోనిత అంటుంది.తరువాత ఏమి జరగనుందో  రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.

Exit mobile version