Site icon Prime9

Janaki Kalaganaledu: సెప్టెంబరు 28 ఏపిసోడులో వచ్చిన ముత్తయిదువులు వాయినాలు తీసుకోకుండా వెళ్లిపోతారు!

janaki kalaganaledu prime9news

janaki kalaganaledu prime9news

Janaki Kalaganaledu Today: నేటి జానకీ కలగన లేదు సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. వాయినాల కార్యక్రమంలో ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు వాయినాలు సమర్పించమని పంతులు చెబుతాడు. ఇంతలో ముత్తయిదువులకు ఇవ్వాల్సిన వాయినాలకు హారతి అంటుకుని కాలిపోతుంటాయి. ఇదంతా మల్లిక చేసిన పనే. జాకెట్ ముక్కలకు తను కావాలనే లక్క పూస్తుంది. లక్కకి మంటని అంటుకునే గుణం ఉంటుంది కాబట్టి, ఆ జాకెట్ ముక్కలు కాలిపోతాయి. దీంతో అక్కడికి వచ్చినవాళ్లంతా అపచారం అపచారం అని గట్టిగా అరుస్తుంటారు. ఇలా జరగడం ఏంటి అని, వాయినాలు తగలబడిపోవడం ఏంటి? అని ఇంటికి అరిష్ఠం అని అందరూ అంటుంటారు.

ఇక నీలావతి, రంగంలోకి దిగి కొత్త కోడలితో పూజ చేయిస్తుంటే ఈ అశుభం ఏంటి జ్ఞానాంబ అని అందరూ ఆమెను అంటుంటారు. మన పద్దతులను పాటించకుండా పూజ చేస్తే అపశ్రుతి కాక ఇంకేం జరుగుతుంది. అమ్మవారికి ఆగ్రహం కలిగిందేమో అందుకే ఇలా జరిగిందని అనుకుంటుంటారు. అగ్ని రూపంలో అమ్మ వారు ఇలా ప్రత్యక్షం అయ్యారు. ఇలాంటి వాళ్లతో వాయినాలు తీసుకుంటే మా పసుపుకుంకుమలు కూడా బలి అవుతాయని నోటికొచ్చినట్టు మాటలు అనేసి జెస్సీని చాలా దారుణంగా అవమానిస్తారు. వచ్చిన ముత్తయిదువులు వాయినాలు తీసుకోకుండానే వెళ్లిపోతారు. ముత్తయిదువులకు జానకి ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోతారు.

ఇదీ  చదవండి: సెప్టెంబర్ 28 ఏపిసోడులో సత్య ఉద్దేశం తెలుసుకోనున్న ఆదిత్య!

Exit mobile version