Site icon Prime9

Jabardasth: రాకేశ్, సుజాత నిజంగానే ప్రేమలో ఉన్నారా?

jabardasth prime9news

jabardasth prime9news

Jabardasth Show: బుల్లితెర పై లవ్ ట్రాకులు ఎంత బాగా ఆకట్టుకుంటాయో మన అందరికీ తెలిసిన విషయమే. అలా జబర్దస్త్ వేదిక మీద ఎన్ని జోడీలు పుట్టుకొచ్చాయో అందరికీ తెలిసిందే. రష్మీ సుధీర్ జోడితో జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద చేసిన కెమిస్ట్రీకి నెటిజన్స్ ఫిదా అయ్యారు. సుధీర్ రష్మీ జోడి తరువాత చాలా జోడీలు వచ్చిన ఆ రేంజ్‌లో సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నించాయి. కానీ అవేవీ హిట్ అవ్వలేదు.

సుధీర్, రష్మీ తరువాత వర్షా, ఇమాన్యుయేల్ జోడికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే వీరు కూడా ఆ రేంజ్‌లో మాత్రం క్లిక్ కాలేక పోయారు. కొన్ని రోజులు రాకేష్ రోహిణి ట్రాక్ నడిచింది కానీ అది కూడా కలిసి రాకపోయే సరికి వెంటనే సుజాత ఎంట్రీ ఇచ్చింది. అలా రాకేష్ సుజాత ట్రాక్ బాగానే బాగానే క్లిక్ అయింది. సుజాత రాకేష్‌ ఇద్దరూ కూడా స్కిట్లో బాగా చేశారు. వారు స్కిట్ల కోసం చేస్తున్నారా? లేక నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనే విషయాన్ని తేల్చాలంటే కొంచెం కష్టమే.

ఐతే ఈ ఈ ఇద్దరూ పై రూమర్లు బాగానే వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నారని తెలుస్తుంది.

Exit mobile version