Site icon Prime9

Guppedantha Manasu: అక్టోబర్ 29 ఎపిసోడ్ లో రిషి కోసం బాధ పడుతున్న మహేంద్ర

guppedantha manasu oct 29 prime9news

guppedantha manasu oct 29 prime9news

Guppedantha Manasu: నేటి గుప్పెడంత మనసు సీరియల్  ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్

కారు దగ్గర నిలబడి…రిషి మహేంద్ర గురించి బాధపడుతుంటే రిషిని చూసి వసు కూడా బాధపడుతుంది.‘మీకన్నా ఎక్కువగా వాళ్లు బాధపడుతుంటారు సార్.. ప్లీజ్ మీరు బాధపడకండి ఏదో ఒక రకంగా నచ్చజెబుతుంది వసు. ‘వసుధారా .. మీ మేడమ్‌కి అన్నీ తెలుసు కదా? ఆవిడైనా ఆపి ఉండాలిసిందిగా..మా డాడ్‌కి నచ్చజెప్పాలి కదా? పోనీ వెళ్ళిన తరువాత ఐనా రిషి బాధపడుతూ ఉంటాడని వెళ్దాం అని చెప్పి ఇక్కడకు తీసుకుని రావాలి కదా?’ అని రిషి బాధగా అంటాడు.‘ఆవిడ చెప్పలేదని మనం ఎలా అనుకుంటాం సార్’ అని వసు అంటుంది.

మరోవైపు…మహేంద్ర బాధని చూసి…జగతీ…మనం కొంచం తగ్గితే మంచిది మహేంద్రా..ఇంక వెళ్లిపోదాం’ అంటూ ఒప్పించే ప్రయత్నం చేస్తుంది.కానీ జగతీ మాటను అస్సలు వినిపించుకోడు మహేంద్ర.పట్టిందే పట్టు లాగా అలాగే ఉంటాడు.కాసేపటికి ప్లేట్లో అన్నం తీసుకొని …తినిపించడానికి జగతి వస్తుంది జగతి. ‘వద్దు నాకు తినాలని లేదని మహేంద్ర అంటాడు. ‘మహేంద్రా.. నువ్వు తినకపోతే.. అక్కడ రిషి కూడా ఎలా తింటాడు.ముందు నువ్వు తిని.. తను తినాలని కోరుకోవడమే ప్రేమ’అంటూ ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి తినిపిస్తుంది.తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version