Site icon Prime9

Guppedantha Manasu: అక్టోబర్ 27 ఎపిసోడ్ లో దేవయానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన వసుధార!

guppedantha manasu oct 27 prime9news

guppedantha manasu oct 27 prime9news

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ‘ఏంటి రిషి నీ వాడా? అసలు రిషి నీ వాడు ఎప్పుడయ్యాడు? మీకు పెళ్లి అయ్యిందా? ఎవరైనా మీ పెళ్లి నిశ్చయించారా? పెద్దవాళ్లు మాట్లాడుకున్నారా ? మరి మీ వాళ్లు వచ్చారా? లేక మేము వెళ్లామా? అసలు నీ గురించి నువ్ ఏమనుకుంటున్నావ్ వసుధారా, ఊరుకునే కొద్ది బాగా రెచ్చిపోతున్నావ్, నాకే మాటకు మాట సమాధానం చెబుతున్నావ్, నన్నే కాఫీలు తెమ్మంటున్నావ్, నోటికి ఎంతొస్తే అంత వాగుతావా? నా ప్లేస్‌లో ఇంకొకరు ఉంటే నీ పని వేరే రకంగా ఉండేది’ అని దేవయాని కోపంగా అంటుంది.

‘మేడమ్ కాస్త ఆపుతారా? నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నేను మీకు లాగే అనుకుంటున్నా మీ ప్లేస్‌లో ఇంకొకరు ఉంటే మా రిషి సార్‌ని అర్థం చేసుకునేవారు. రిషి సార్ ముందే మహేంద్ర సార్‌ని, జగతీ మేడమ్‌ని మీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. నేను రిషి సార్ కోసం వచ్చాను మేడమ్. మీ కోసం కాదు, రిషి సార్ రమ్మంటేనే ఇక్కడికి వచ్చాను. రిషి సార్ రమ్మనకపోయినా ఇక్కడికి వస్తాను. మీ పెత్తనం నా దగ్గర చలాయించకండి’ అని వసు అంటుంది.‘ఇంత అహంకారం ఎక్కడనుంచి వచ్చింది వసుధార, రిషి అండ చూసుకునే కదా?’ అంటుంది కోపంగా దేవయాని అంటుంది.

Exit mobile version