Site icon Prime9

Guppedantha Manasu: అక్టోబర్ 01 ఏపిసోడులో రిషికి అడ్డంగా బుక్ అయిన వసుధార

guppedantha manasu serial 01 Oct prime9news

guppedantha manasu serial 01 Oct prime9news

Guppedantha Manasu Today: నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. వసు, మళ్లీ అడ్డంగా దొరికేసింది. ఈ సారి సింపుల్‌గా ఒక అబద్దం చెప్పి ఈజీగా బుక్ ఐపోయింది. అగ్నికి ఆజ్యం పోసినట్లే మారింది వసు పరిస్థితి. వసు జాబ్‌లో జాయిన్ అవ్వడం ఏంటీ ? ఆ విషయం నాకు చెప్పకపోవడం ఏంటీ  అని ఒక పక్క రిషి రగిలిపోతుంటే, వసు వచ్చి ‘ఒక ఇంటర్వ్యూకి వెళ్లాను. అది వస్తుందో రాదోనని అప్లై చేశాను. అందుకే మీతో ఆ విషయం గురించి చెప్పలేదని అంటుంది. అలా చెప్పిన తర్వాత కొంచం కూల్ అవుతాడు రిషి. ఇంతలో మహేంద్ర, జగతీలు వచ్చి, ‘మినిస్టర్ గారు కాల్ చేశారు రిషి, వెళ్తున్నారా’ అని అనడంతో ఇంక వసు, రిషీలు మినిస్టర్ దగ్గరకు బయలుదేరతారు.

ఇక వసు, రిషీ ఓకే కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు కానీ, ఎందుకో రిషి మౌనంగానే ఉంటాడు. అప్పుడు వెంటనే వసు రిషి చేతి మీద చేయి వేసి, ప్రేమగా ‘సార్ కారు ఆపండి’ సార్ అని అంటుంది. కానీ రిషి ఆపకుండా కార్ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. ‘సార్ అన్ని సార్లు మీరు మౌనంగా ఉండటం మీకు అంత మంచిది కాదు సార్, ఆపండి సార్ కారు’ అని కోపంగా అంటుంది. ఇంక రిషి ఆపుతాడు. ఆపిన తరువాత రిషి మనసులో “ఈ మధ్య ఈ వసుధార ఆదిపత్యం ఎక్కువ అవుతోందని” అనుకుంటాడు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ చదవండి : అక్టోబర్ 01 ఎపిసోడ్ లో కార్తీక్ దగ్గర మోనితను ఇరికించిన దుర్గా?

Exit mobile version