Site icon Prime9

Gruhalakshmi: అక్టోబర్ 29 ఎపిసోడ్ లో తులసిని నీచంగా చూసిన లాస్య!

gruha lakshmi oct 29 prime9news

gruha lakshmi oct 29 prime9news

Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ‘పెళ్లి తరువాత నువ్వు జరుపుకోవాల్సిన కార్యక్రమం పెళ్లికి ముందే, ఒక పెళ్లైన మగ వాడితో నా బెడ్ రూంలో నువ్వు నా ముందే జరుపుకున్నావ్ లాస్యా. ఛీ నోరు మూయ్ నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. సమాజం గురించి ఆలోచించకుండా, కట్టుబాట్లను పట్టించుకోకుండా బరి తెగించి ప్రవర్తించింది నువ్వు. నీ ప్రియుడు నందూ’ అంటూ అరుస్తూ చెప్తుంది తులసి. ఆ తరువాత అనసూయ దగ్గరకు వెళ్లి, ‘ఆవేశంలో నన్ను ఎన్ని మాటలు అన్నారో కానీ. అవి అనాల్సింది నన్ను కాదు. మీ కొడుకుని, మీ కోడల్ని చేయకూడని తప్పులన్నీ బరి తెగించి మీ ముందే చేశారు. వాళ్లని అనడం మానేసి నన్ను అంటున్నారా అని అడుగుతుంది.

వీళ్లు నిన్ను ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని నిందలు వేశారో నేను ఊహించగలను. వీళ్లు ఇంకా ఎంతకైనా దిగజారతారు. ఇలాంటి దిగజారిన మనుషుల మధ్య నా బిడ్డ ఉండటం నాకు ఇష్టం లేదమ్మా? తప్పు అంతా నాదేనమ్మా. నన్ను క్షమించు, ఈ పంజరం నుంచి నువ్వు ఎగిరిపో స్వేచ్ఛగా, నీకు ఎక్కడ నచ్చితే అక్కడికి. నీకు కావాల్సిన చోటికి ఎగిరిపో, నువ్వు ఏ తప్పు చేయలేదనే అనే భావన లేకుండా ఇక్కడ నుంచి. దేవత ఎప్పుడూ గుడిలోనే ఉండాలి. ఇలాంటి బజారులో కాదమ్మా అంటూ ఎమోషనల్ అవుతాడు పరందమాయ్య.

Exit mobile version