Site icon Prime9

Gruhalakshmi: నవంబర్ 01 ఎపిసోడ్ లో శీల పరీక్షకు నిలబడలేనంటున్న తులసి

gruha lakshmi 01 Nov prime9news

gruha lakshmi 01 Nov prime9news

Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. తులసి తల్లీ, తులసి ఇద్దరూ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి కేరాఫ్ అడ్రస్ అన్నమాట. చూసే వాళ్ళకు ఏం సెంటిమెంటు అబ్బా అని అనిపిస్తుంది. ఈ గోల ఇలా ఉండగా, ఆ అమ్మ కొడుకు సామ్రాట్‌ని మా అమ్మ దగ్గరకి రండి సార్ అని వచ్చి బ్రతిమిలాడేస్తుంటాడు. ‘అన్ని బంధాలను వదిలి మా అమ్మ మీ స్నేహాన్ని మాత్రమే నమ్మింది. ఈ సమయంలో మా అమ్మకి మీ స్నేహం చాలా అవసరం, రండి సార్ మా అమ్మ దగ్గరకు వెళ్దాం’ అంటూ సామ్రాట్‌ని బ్రతిమిలాడి, ఎట్టకేలకు తులసి దగ్గరకు తీసుకుని వస్తాడు ప్రేమ్.

ఇక తులసి, నేను ఏ తప్పు చేయలేదని మీరిద్దరూ నమ్ముతున్నారు కదా? అని తులసి తల్లీ, తముడ్ని అడుగుతుంది. నా కుటుంభంలో వాళ్ళ లాగా మీ మనసులో కూడా అలాంటి అనుమానాలు ఉంటే చెప్పండి. ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్లిపోతా, ఎందుకంటే నా నిజాయితీని మీ దగ్గర కూడా నా నిజాయితీని నేను నిరూపించుకోలేను. ఏ ఆడదానికైనా భరించలేని నరకం ఏంటంటే తాను పవిత్రురాల్ని అని నిరూపించుకోవడం. ఇంకా చెప్పాలంటే శీల పరీక్షకు నిలబడటం, నా భయం నాకు ఉంటుంది అమ్మా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా అమ్మా అని తులసి అంటుంది. దీంతో తులసి తల్లి నా కూతురు ఏ తప్పు చేయదు అంటూ చెప్పుకొస్తుంది.

Exit mobile version