Site icon Prime9

Gruhalakshmi: అక్టోబర్ 13 ఎపిసోడ్ లో నా బాధను అర్దం చేసుకోవా? అంటున్న అనసూయ

gruha lakshmi 13 oct prime9news

gruha lakshmi 13 oct prime9news

Gruhalakshmi Today:  నేటి గృహ లక్ష్మీ సీరియల్ ఏపిసోడ్ లో ఈ రెండు సీనులు హైలెట్. తులసి ఇద్దరి కోడళ్లతో ఈవిధంగా ఆవిడ ఏం చెప్పిందో బాగా వినబడిందా? అని గట్టిగా అంటుంది. మా వయసు వాళ్ళు మనవళ్లతో ఆడుకుంటున్నారు. మాకు ఆ కోరిక ఉంది అని అనసూయ, పరందామయ్యలు ఇద్దరూ అనడంతో తులసి కూడా, నేను ఈ విషయం ఎప్పటి నుంచో అడగాలని అనుకుంటున్నా. కానీ ఇప్పటి వరకు అడిగే సందర్భం రాలేదు. ఏంటి మీరు ఇప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నారా? అని అడుగుతుంది. దీంతో రెండు జంటలు ఒకరికొకరు ముఖా ముఖాలు చూసుకుంటారు. మాట్లాడరేంటి? అని తులసి గట్టిగా అడిగేసరికి, శ్రుతి నిజం చెప్పేస్తే మంచిది అనుకునే లోపు ఇంతలో ప్రేమ్ అడ్డుకుని అయ్యో అలాంటిది ఏమీ లేదని అంటాడు.

నువ్వు చాలా మారిపోయవ్ తులసి

అబ్బా ఎంతసేపు నీ బాధ నీదే కానీ, నా బాధను అర్దం చేసుకోవా ? నా బాధను అర్దం చేసుకోవడానికి ట్రై చేయడం లేదు. నువ్వు చాలా మారిపోయావ్. మా తులసి ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచించేది. కుటుంబం తరువాతే ఎవరైనా అనుకునేది. కానీ ఇప్పుడు ఈ తులసి తన గురించి తప్ప తన కుటుంబాన్ని అసలు పట్టించుకోవడం లేదని అంటుంది అనసూయ. అంటే మీరు నాలో స్వార్ధం పెరిగిందని అంటున్నారా? అత్తయ్య అని తులసి అనడంతో, ఆ ప్రశ్న నన్ను కాదు నీ అంతరాత్మని అడుగు తులసి అని అనసూయ అంటుంది. ‘నేను అంతరాత్మని కాదని ఏ పనీ చేయను అత్తయ్య. నా అంతరాత్మ నాకు చెప్తూనే ఉంటుంది. నేను ఏమి చేస్తున్నానో అని అంటుంది తులసి.

Exit mobile version