Site icon Prime9

Gruha Lakshmi: సెప్టెంబర్ 22 ఏపిసోడులో నేను రెచ్చిపోతే మీరు తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చిన తులసి

gruha lakshmi 22 prime9news

gruha lakshmi 22 prime9news

Gruha Lakshmi: నేటి గృహలక్ష్మీ ఏపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్. నాకు విడాకులు ఇచ్చావు. నా కుటుంబాన్ని నీ గుప్పెట్లో పెట్టుకున్నావ్, నీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నావు. ఈ లోకం ముందు నన్ను విలన్‌ని చేసి పడేశావు అని నందు అంటాడు. దీంతో తులసి ‘నా బ్రతుకు నేను బతుకుతుంటే నన్ను మీరు రెచ్చగొడుతున్నారు. నేను రెచ్చిపోతే మీరు తట్టుకోలేరని వార్నింగ్ ఇస్తుంది తులసి. తులసి ఎక్కువ మాట్లాడకు ‘రెచ్చగొడుతుంది నువ్వు, మా ఇంట్లో వాళ్ళకి ,నాకు చిచ్చు పెట్టింది నువ్వు, హనీకి సేవ చేయడం కోసం మా ఇంట్లో వాళ్లందర్నీ నీతో తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి? అని నందు కోపంగా అడుగుతాడు. మీ మనసులో విషం నింపుకున్నారు కాబట్టి మీకన్ని నెగెటివ్ గానే కనిపిస్తాయి. ‘వాళ్లంతా మానవత్వంతో వచ్చారు. ఈ ఇంట్లో ఉన్న వాళ్లు తన వాళ్లు అనుకుని వచ్చారు’ అని అంటుంది తులసి. అబ్బో మాటలు బాగానే మాట్లాడుతున్నావ్, తన వాళ్లు ఎలా అయ్యారో కొంచం చెబుతారో అంటూ నందు అడగడంతో, మీరు ఎప్పటికీ మారరని తులసి అంటుంది.

ఆ సామ్రాట్‌ని మా వాళ్ళకి దగ్గర చేస్తే బాగోదు..

పెళ్లి కాకముందు మీరు లాస్యని తీసుకుని వచ్చి, ఏకంగా మన బెడ్ రూంలోనే చోటు ఇచ్చారు. మరి అప్పుడు మీకు అది తప్పుగా అనిపించలేదా? పెళ్లానికి సమాధానం చెప్పాలని తెలియలేదా, ప్రశ్నించే హక్కు మీకు ఒక్కరికే ఉంటుందా, మాకు ఉండదనుకున్నరా  అని అడుగుతుంది తులసి. ‘నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు నాకు సంబంధం లేదు కానీ, ఆ సామ్రాట్‌ని మా వాళ్ళకి దగ్గర చేస్తే బాగోదు అని నందు వార్నింగ్ ఇవ్వడంతో, హలో నందు గారు ఇప్పుడు అది మీ ఫ్యామిలీ కాదు. నా ఫ్యామిలీ కూడా, అది తెలుసుకుంటే మంచిది. మీ మాట వినాలనుకుంటే ఒక పెంపుడు కుక్కని పెంచుకోండి. అది మీ కాళ్ల దగ్గరే పడి ఉంటుంది అని అంటుంది తులసి. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసు కుందాం.

Exit mobile version