Site icon Prime9

Gruha Lakshmi: సెప్టెంబర్ 23 ఏపిసోడులో తులసిని జనరల్ మేనేజర్‌గా ప్రకటించిన సామ్రాట్

gruha lakshmi 23 prime9news

gruha lakshmi 23 prime9news

Gruha Lakshmi: నేటి గృహలక్ష్మీ ఏపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్

ఆవేశపడకండి సార్..వీడిని పోలీసులకు పట్టిస్తే వీడి సంగతి వాళ్ళే చూసుకుంటారు అని నందు అనడంతో..అప్పుడు సామ్రాట్ ఇలాంటి వాళ్లకి ఆ డోస్ ఒక్కటే సరిపోదు నందు రెండు కాళ్లు విరగ్గొట్టాల్సిందే అని గట్టిగా అరిచి చెప్తాడు.అప్పుడు ఆ మేనేజర్ వెంటనే తులసిని బ్రతిమిలాడుకోవడం మొదలు పెడతాడు.ఇక లాభం లేదు లే కానీ తులసి గారు జాలి పడితే తప్ప నేను దీన్ని బయటపడలేనని… ఆమెను బ్రతిమిలాడతాడు.మేడమ్ నన్ను జైలులో పెడితే..నా కూతురు జీవితం పాడైపోతుంది.జీవితంలో ఎప్పుడూ ఏ తప్పు చేయను.. మీ కాళ్లు పట్టుకుంటాను మేడమ్ అని మేనేజర్ తులసి కాళ్లపై పడతాడు. తులసి కాళ్లపై పడి వేడుకుంటాడు.. దానితో మేడమ్ గారు శాంతిస్తారు..మేనేజర్ మీద జాలిచూపిస్తారు.

తులసిని జనరల్ మేనేజర్‌గా ప్రకటించిన సామ్రాట్

నందు, లాస్యలను పిలిచి వాళ్ల ముందే సామ్రాట్, తులసిని జనరల్ మేనేజర్‌గా ప్రకటిస్తాడు.దీనితో నందు, లాస్యల మొహాలు మాడిపోతాయి.ఆ తరువాత ఆఫీసులో పని చేసే వాళ్ళంతా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తారు. జనరల్ మేనేజర్ అంటే ఆఫీస్‌ వ్యవహారాలన్ని చూసుకోవాలి.ఫైల్స్ దగ్గర నుంచి మెయిల్స్..మీటింగ్‌.. లావాదేవీలు..ఇలా చదువుతో ముడిపడిన వ్యవహారాలన్ని చాలానే ఉంటాయని,మరి అక్షరం ముక్క తెలియని తులసిని జనరల్ మేనేజర్‌‌గా సామ్రాట్ ఎందుకు పెట్టుకున్నారనే సందేహాలు కలిగేట్టు చేస్తాడు సామ్రాట్. ఇక తులసి అయితే..‘సామ్రాట్ గారు సరదాగా అంటే మీరంతా నిజమే అని నమ్మేస్తారా? నేను చిన్న గడ్డిపరకని , నన్ను తీసుకెళ్ళి సింహాసనంపై ఎలా కూర్చోబెడతారంటూ అని అంటుంది తులసి.తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

Exit mobile version