Site icon Prime9

Gruha lakshmi: సెప్టెంబర్ 29 ఏపిసోడులో ఈ అమ్మ మీకు ఎప్పటికి కనిపించదంటూ ఎమోషనల్ అయిన తులసి!

gruha lakshmi 29 prime9news

gruha lakshmi 29 prime9news

Gruha lakshmi Today: నేటి గృహలక్ష్మీ సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్. ‘నీ ఆరాటం నాకు అర్ధమైంది నాన్నా, నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా, నేను కూడా అంతకంటే ఎక్కువగానే నా జీవితం గురించి ఆలోచిస్తున్నా నాన్న. నేను నా జీవితాన్ని అంత తేలిగ్గా తీసుకోను. దాని విలువ నాకు మాత్రమే తెలుసు. నువ్వు నాతో మనసు విప్పి మాట్లాడావ్. నాకు చాలా సంతోషంగా ఉంది అభి. నాకు కావాల్సింది ఇదే. నీ నుంచి నేను ఇదే కోరుకుంటున్నా. నా విషయంలో నేను తప్పు చేస్తున్నానంటే నా కొడుకుగా నీకు నిలదీసే హక్కు ఎప్పటికీ ఉంటుంది. ఈ ఇంటికి, మీకు ఎప్పటికీ తలవంపులు తీసుకుని రాను. అలా చేసిన రోజు మీ అమ్మ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది. ఈ అమ్మ మీకు ఎప్పటికి కనిపించదంటూ ఎమోషనల్ అవుతుంది తులసి.

ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. తులసిని పిలిచి చెప్పేస్తాను. ఇక పై ఆ సామ్రాట్‌ ఆఫీసులో కలిసి పనిచేసేది లేదని చెప్పేస్తానని అంటుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి, ఈ విధంగా ఎవరో ఏదో అన్నారని మా అమ్మ కాళ్లు కట్టేస్తామా? అని ప్రేమ్ అంటే, పరందామయ్య నీకో దండమే బాబు మళ్లీ నువ్ ఒకప్పటి అనసూయలా మారకే అని ప్రాదేయపడతాడు. దీంతో అనసూయ, అప్పుడు పరిస్థితులు చేజారిపోతున్నాయి. నేను నిన్నటి వరకు కూడా తులసి వైపే ఉన్నా, ఇక మౌనంగా ఉండలేను. ఇంక నుంచి సామ్రాట్ ఆఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని తులసికి మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ చదవండి: సెప్టెంబర్ 29 ఏపిసోడులో మోనిత అల్లిన కథకు అవార్డు ఇచ్చిన తప్పులేదు!

Exit mobile version