Site icon Prime9

Devatha: జొన్న కంకెలు కోసినట్లు నీ పీక కోసే రోజులు వస్తాయి యాదిపెట్టుకో అంటున్న భాగ్యమ్మ

devatha oct 12 prime9news

devatha oct 12 prime9news

Devatha Today: నేటి  దేవత సీరియల్ ఎపిసోడ్ లో  ఈ రెండు సీనులు హైలెట్.  ‘భాగ్యమ్మా చాలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్, రాధ చూస్తే బాధపడుతుందని ఆగుతున్నాను’ మాధవ అంటాడు. ‘నా బిడ్డని బాధపెట్టేదే నువ్వు, ఇప్పుడు నా బిడ్డ బాధపడుతుందని ఆగుతున్నావా? బిడ్డా చూడు, జొన్న కంకిలు కోసినట్లు నీ పీక కోసే రోజులు వస్తాయి యాదిపెట్టుకో’ అని కోపంగా అనేసి అక్కడ నుంచి భాగ్యమ్మ వెళ్లిపోతుంది. ఆ మాటలు విన్న మాధవ రగిలిపోతాడు.

మరోవైపు మాధవ, జానకీ దగ్గరకు వెళ్లి, ఎప్పటిలానే తన పైత్యం కన్న తల్లి దగ్గర చూపిస్తాడు. నువ్వు ఇలా పడిపోయి మంచి పని చేశావమ్మా. రాధ ఇప్పుడు నా ఇంట్లోనే ఉంటుంది. నిన్ను వదిలిపెట్టు పోలేదు అప్పుడు నాకు రాధ దక్కుతుంది అంటూ తన పైత్యం మొత్తం ఆమె దగ్గర చూపిస్తుంటాడు. అదంతా భాగ్యమ్మ చూసి, ఓరీ నీ వేషాలు తగలయ్యా ‘వీడికి ఇదేం పోయేకాలం’ అని మనసులో అనుకుంటుంది. మరోవైపు రాధ, జానకీని చూసుకునే విధానాన్ని చాటుగా చూసి, ‘ఏ రోజుకైనా నా రాధ కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకుంటుంది’ అని మురిసిపోతుంటుంది.

దేవి వాళ్లకంటే ముందే వచ్చి ఆదిత్య స్కూల్లో ఉంటాడు. రామ్మూర్తి పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్లాక, దేవితో మాట్లాడాలని ఆదిత్య చాలా ప్రయత్నిస్తాడు. దేవి మాట్లాడానికి సిద్ధపడదు. ‘నాకు ఎవరితో మాట్లాడాలని లేదు అని అనేసి వెళ్లిపోతుంది. దాంతో దేవికి ఏమై ఉంటుందోననే భయంతో రాధని కలుస్తాడు. రాధా ఆదిత్య దేవి గురించి మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ల దగ్గరల్లో ఓ కారు ఆగుతుంది. ఆ కారులోంచి సత్య దిగుతుంది.

ఇదీ  చదవండి: అక్టోబర్ 12 ఎపిసోడ్ లో కాకమ్మ కబుర్లు చెప్పమాకంటున్న అనసూయ

ఇదీ  చదవండి: అక్టోబర్ 12 ఎపిసోడ్ లో మోనిత వేషాలు మాములుగుగా లేవుగా..

 

Exit mobile version