Site icon Prime9

Devatha: అక్టోబర్ 27 ఎపిసోడ్ లో మాధవ ఇంట్లో భాగ్యమ్మను చూసి షాక్ ఐనా సత్య

devatha oct 27 prime9news

devatha oct 27 prime9news

Devatha Today: నేటి  దేవత సీరియల్ ఎపిసోడ్ ఈ రెండు సీన్లు హైలెట్. ఓవైపు చిన్మయి, రాధకు ఫోను చేసి ‘చెల్లెలు కనిపించిందా అమ్మా?’ అని అడిగితే, అనాథ ఆశ్రమంలో ప్రత్యేక్షసాక్షి చెప్పిన విషయం మొత్తం చిన్మయికి రాధ చెబుతుంది.‘చెల్లెల్ని తీసుకుని త్వరగా వచ్చేస్తాం తల్లీ, నువ్వు బాధపడొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.‘నువ్వు చిన్మయికి ఎందుకు చెప్పావ్. చిన్మయి ద్వారా ఆ మాధవ ఈ విషయం తెలుసుకుంటే దేవి మన చేతికి దొరక్కముందే వాడు ఏం కుట్ర చేస్తాడో ఏమో, అంటూ ఇద్దరూ కంగారుపడుతూ ఉంటారు. ఇక ఇద్దరూ కొండగూడెం వైపు కారులో వెళ్తూ ఉంటారు.

మరోవైపు, ఆదిత్య ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, ఆదిత్య కోసం ఆఫీస్ వాళ్లంతా ఇంటికి కాల్ చేస్తున్నారు సత్యా అంటూ దేవుడమ్మ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు సత్య మనసులో ఈ విధంగా ‘దేవిని వెతికే వంకతో ఆదిత్య అక్కతో కలిసి తిరుగుతున్నా విషయం మీకు ఇంకా తెలియదు కదా ఆంటీ? అనుకుంటూ ఉంటుంది. ఇక దేవి వివరాలు తెలుసుకోవడానికి మాధవ ఇంటికి వెళ్లిన సత్యకు, భాగ్యమ్మ అక్కడ ఇల్లు శుభ్రం చేస్తూ దొరికిపోతుంది. అమ్మ ఏంటి ఇక్కడ అని షాక్ అవుతుంది. ‘నువ్వు ఇక్కడున్నా ఏంటమ్మా ’ అని సత్య అడుగుతుంది. ‘రా బిడ్డా ఇట్లా’ అంటూ చుట్టు పక్కల చూసుకుంటూ పక్కకు లాక్కునిపోతుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Exit mobile version